ప్రతి పాక్ బుల్లెట్‌కు బాంబుతోనే పరిష్కారం: అమిత్ షా

నరేంద్రమోదీ పాలనలో భారతదేశం ముందుకు దూసుకువెళ్తోందని ప్రతి రాష్ట్రం భావిస్తోంది. ఆయన (మోదీ) ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు.

Last Updated : Mar 25, 2018, 04:52 PM IST
ప్రతి పాక్ బుల్లెట్‌కు బాంబుతోనే పరిష్కారం: అమిత్ షా

'సరిహద్దు తీవ్రవాదం, అక్రమ చొరబాట్లకు పాకిస్థాన్ నుంచి వచ్చే ప్రతి బుల్లెట్‌కు ఒక బాంబు ఏకైక పరిష్కారం' అని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. శనివారం ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అమిత్ షా మాట్లాడుతూ, "ప్రతి పాకిస్తానీ బుల్లెట్‌కు భారతదేశ సాయుధ దళాలు బాంబులతో స్పందిస్తాయి. ఇది మాత్రమే పరిష్కారం. బులెట్లు మరియు బాంబులు మధ్య శాంతి చర్చలు ఉండవు" అని చెప్పారు.

సర్జికల్ స్ట్రైక్, భారతదేశంలో అక్రమంగా చొరబడుతున్న ఉగ్రవాదులకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ అమిత్ షా పైవిధంగా స్పందించారు. రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల గురించి ప్రశ్న అడిగినప్పుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని అమిత్ షా అన్నారు.

'ఇటీవలి ఎన్నికల్లో ఓటమికి గల కారణాన్ని పరిశీలించడానికి మేము ఒక కమిటీని ఏర్పాటు చేశాము. నివేదికల ప్రకారం చర్యలు చేపడతాం. ఉప ఎన్నికలు స్థానిక సమస్యలతో ముడిపడి ఉంటాయి. 2019 సాధారణ ఎన్నికలకు మేము సిద్దమవుతున్నాము. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీ వస్తుంది' అని అధికార పార్టీ చీఫ్ పేర్కొన్నారు.

ప్రధానమంత్రిని అమిత్ షా ప్రశంసిస్తూ, "నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ముందుకు దూసుకువెళ్తోందని ప్రతి రాష్ట్రం భావిస్తోంది. ఆయన(మోదీ) ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరు" అని అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకకు వెళ్లి తరచూ ఆలయాలు, చర్చిలు, మసీదులు సందర్శించడంపై బీజేపీ చీఫ్ స్పందించారు. "ఆయన గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో దేవాలయాలకు వెళ్ళారు. కానీ ఏమి జరిగింది? 1967 తరువాత కాంగ్రెస్ 50 శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించలేదు.' అని అన్నారు.

Trending News