DA hike for Central govt employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు Good news.. డీఏ పెంపుపై కేంద్రం ప్రకటన

DA hike for Central govt employees: కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్.. 3 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 04:31 PM IST
  • నేటి కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు
  • DA hike పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, పెన్షనర్లకు Good news చెప్పిన సర్కార్
DA hike for Central govt employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు Good news.. డీఏ పెంపుపై కేంద్రం ప్రకటన

DA hike for Central govt employees: న్యూ ఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ పెంపు సహా అనేక కీలక విషయాలపై నిర్ణయం తీసుకుంది. 

కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్.. 3 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 2021 జులై 1 నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఈ డిఏ పెంపు (DA hike date) వర్తిస్తుందని కేంద్ర మంత్రి థాకూర్ స్పష్టంచేశారు.

Also read : India Crosses 1 Billion Vaccination: భళా 'భారత్'.. 100 కోట్ల టీకాల పంపిణీ పూర్తి

కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో 47 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి (Central govt employees) చేకూరనుంది. తాజా పెంపుతో కలిపి డియర్‌నెస్ అలవెన్స్ 28 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ (Union Minister Anurag Thakur) తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు సైతం ఈ డిఏ పెంపు (DA hiked for pensioners) వర్తిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ తేల్చిచెప్పారు.

Also read : Covid-19 vaccine second dose due: ఆ 10 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోలేదు

Also read : Axis Bank Bumper Offer on Home loans: యాక్సిస్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్, 12 నెలలు ఈఎంఐ మాఫీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News