Delhi Chalo protest: రైతులకు రాజధాని ఢిల్లీలోకి అనుమతి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్‌ (Delhi Chalo protest) ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.

Last Updated : Nov 27, 2020, 04:20 PM IST
Delhi Chalo protest: రైతులకు రాజధాని ఢిల్లీలోకి అనుమతి

Delhi Chalo farmer's protest: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు (new farm laws) వ్యతిరేకంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్‌ (Delhi Chalo protest) ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకపోవడంతో.. చివరకు వారిని ఢిల్లీలోకి అనుమతిస్తున్నట్లు (Delhi Police allows entry) పోలీసులు వెల్లడించారు. కొన్ని కండీషన్లతో వారిని నగరంలోకి అనుమతిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అయితే రైతులు ఎస్కార్ట్ మధ్యనే నగరంలోకి రావాలని.. అంతేకాకుండా తమ నిరసనను శాంతియుతంగా జరుపుకోవాలని క‌మిష‌న‌ర్ అలోక్ కుమార్ వ‌ర్మ సూచించారు. ఈ మేరకు నిరసన తెలుపుకోవడానికి రైతులకు బురారీ ప్రాంతంలోని నిరంకారీ మైదానాన్ని కేటాయించిన‌ట్లు అలోక్ తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, రైతు సంఘాల నాయకుల మధ్య భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మొద‌ట రామ్‌లీలా మైదానంలో నిర‌స‌న తెలుపుతామ‌ని నాయకులు కోరగా.. పోలీసులు దానిని నిరాక‌రిస్తూ బురారీ ప్రాంతంలోని మైదానాన్ని కేటాయించారు. 

అయితే గురువారం ప్రారంభమైన ఢిల్లీ చలో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఎక్కడికక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా ఢిల్లీ సరిహద్దుకు చేరిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు శుక్రవారం ఉదయం టియర్‌ గ్యాస్‌‌ను ప్రయోగించారు. కొన్నిచోట్ల లాఠిఛార్జ్ చేయడంతోపాటు జల ఫిరంగులను సైతం ప్రయోగించారు. Also read: Delhi Chalo protest: ఉద్రిక్తంగా ‘ఢిల్లీ ఛలో’ మార్చ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News