Farmer protests: వీడని ప్రతిష్టంభన.. రేపు మరోసారి భేటీ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను (Farm Bills) రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు స్పష్టంచేశాయి. తమకు వ్యవసాయ చట్టాల్లో సవరణలు అవసరం లేదని, వాటిని రద్దు చేయాల్సిందేనని రెండోసారి కేంద్రంతో జరిగిన చర్చల్లో 40 రైతు సంఘాల ప్రతినిధులు (Farmers Organizations) తేల్చిచెప్పారు.

Last Updated : Dec 4, 2020, 07:43 AM IST
Farmer protests: వీడని ప్రతిష్టంభన.. రేపు మరోసారి భేటీ

Delhi Chalo farmers protest: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ( Farm Bills ) రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు స్పష్టంచేశాయి. తమకు వ్యవసాయ చట్టాల్లో సవరణలు అవసరం లేదని, వాటిని రద్దు చేయాల్సిందేనని మరోసారి కేంద్రంతో జరిగిన చర్చల్లో 40 రైతు సంఘాల ప్రతినిధులు (Farmers Organizations) తేల్చిచెప్పారు. దీంతో గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 8 గంటలపాటు కొనసాగిన చర్చలు ఎటువంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి. అయితే కొత్త సాగు చట్టాలపై రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోని శనివారం మరలా చర్చిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ ( Narendra Singh Tomar ) పేర్కొన్నారు. గురువారం జరిగిన చర్చల్లో 40మంది రైతు సంఘాల ప్రతినిధులతోపాటు కేంద్రం తరఫున వ్యవసాయమంత్రితోపాటు రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌, వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్‌ పాల్గొన్నారు. Also read: Farmer protests: ప‌ద్మ‌విభూష‌ణ్‌ను వెన‌క్కిచ్చిన పంజాబ్ మాజీ సీఎం

అనంతరం వ్యవసాయ మంత్రి తోమర్‌ మీడియాతో మాట్లాడుతూ.. తదుపరి సమావేశం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందన్నారు. కొత్త చట్టాల్లో రైతుల్లో నెలకొన్న ఆందోళనలపై చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, వారు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. ఇదిలాఉంటే.. సమావేశం అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. అయితే తాము చట్టాల్లోని లోపాలను తెలిపామని.. కానీ సవరణలను కోరుకోవడం లేదని ఏఐకేసీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా పేర్కొన్నారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్నదే తమ డిమాండ్‌ అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం 11 గంటలకు అన్ని రైతు సంఘాలు సమావేశమై, శనివారం జరిగే చర్చలకు సంబంధించి సమిష్టి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.  Also read: GHMC Election Results: మధ్యాహ్నానికి తొలి ఫలితం!

దేశంలోని పలు రైతు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్‌ (Delhi Chalo protest) నిరసన శుక్రవారంతో తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ.. చలి తీవ్రత పెరిగినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా పలు ప్రాంతాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. Also Read| GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News