Covid Third Wave: కరోనా సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల్నించి తేరుకోకముందే..థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంటోంది. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నుంచి అప్రమత్తమయ్యేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పట్నించే సన్నాహాలు చేస్తోంది. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి దేశమంతా అల్లాడిపోయింది. దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్(Oxygen Shortage), బెడ్స్, అత్యవసర మందులు, వైద్య సామగ్రి కొరత ఏర్పడటంతో..విదేశాల్నించి సహాయం తీసుకునే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) ముప్పు హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ థర్డ్‌వేవ్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపనుందనే ఆందోళన ఎక్కువగా ఉంది. దాంతో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పట్నించే సమాయత్తమయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) చిన్నారుల్ని కరోనా నుంచి కాపాడేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్(Special Taskforce) ఏర్పాటు చేశారు.
కోవిడ్ 19 సెకండ్ వేవ్ నియంత్రణ, ఆక్సిజన్ బెడ్స్, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ పరికరాల్ని సిద్ధం చేయడంపై అధికారులతో సమీక్షించారు. కరోనా థర్డ్‌వేవ్‌ను ( Corona Third Wave)ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు సింగపూర్ స్ట్రెయిన్ థర్డ్‌వేవ్ ఇండియాలో చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందంటూ అరవింద్ కేజ్రీవాల్(Arvind kejriwal) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సింగపూర్ ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Also read: Nitin Gadkari on Vaccine: వ్యాక్సినేషన్‌పై నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook