Self Isolation: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికించేస్తోంది. దేశ రాజదాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) గజగజలాడిస్తోంది. ప్రాణాంతకమవుతోంది. దేశవ్యాప్తంగా రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు ఓ వారం రోజుల్నించి నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 2 లక్షల 59 వేల కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. దేశంలో మహారాష్ట్ర తరువాత ఢిల్లీలోనే పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజుకు 25 వేలకు పైగా కేసులతో నగరవాసుల్ని బెంబేలెత్తిస్తోంది. ఈ తరుణంలో కరోనా సంక్రమణను అడ్జుకునేందుకు ఏప్రిల్ 26వ తేదీ వరకూ అంటే ఓ వారం రోజాలపాటు లాక్‌డౌన్ ( Lockdown in Delhi) విధించింది ఆప్ ప్రభుత్వం. తప్పనిసరి పరిస్థితుల్లోనే లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) తెలిపారు. అంతకుముందే ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూ అమలు చేసినా ప్రయోజనం లేకపోయింది.
మరో వైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత తాజాగా కోవిడ్ 19 బారిన పడ్డారు. దాంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం స్వీయ నిర్భంధం ( Arvind kejriwal in self isolation) లోకి వెళ్లిపోయారు. ఢిల్లీలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గత ఏడాది జూన్ నెలలో జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో కేజ్రీవాల్ కరోనా పరీక్షలు చేయించుకోగా..నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ముందు జాగ్రత్త చర్యగా స్వీయ నిర్భంధంలో వెళ్లారు.
Also read: Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్, కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook