Arvind Kejriwal Arrest: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన..?.. సంచలన వ్యాఖ్యలు చేసిన లెఫ్ట్ నెంట్ గవర్నర్..

Delhi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో రాజకీయంగా తీవ్ర దుమారంగా మారింది. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.   

Written by - Inamdar Paresh | Last Updated : Mar 28, 2024, 09:32 AM IST
  • జైలు నుంచి పాలన సబబు కాదన్న లెఫ్ట్ నెంట్ గవర్నర్..
  • తీవ్రంగా మండిపడిన ఆప్ మంత్రి..
Arvind Kejriwal Arrest: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన..?.. సంచలన వ్యాఖ్యలు చేసిన లెఫ్ట్ నెంట్ గవర్నర్..

Delhi LG VK Saxena Comments Over Presidential Rule In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఈడీ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీనిన అరెస్టు చేసిన ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సైతం.. ఈడీ అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఒకవైపు దేశంలో ఎన్నికలు, మరోవైపు ఈడీ దూకుడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలోనే.. కేరళ సీఎం పినరయి విజయన్ కూతురు వీణను కూడా ఈడీ మనీలాండరీంగ్ కింద కేసులను నమోదు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జైలు నుంచి పాలన సాగిస్తున్నారు.

Read More: BMTC Conductor Slaps Woman: వామ్మో.. మహిళా ప్రయాణికురాలిని చావబాదిన కండక్టర్.. వీడియో వైరల్..

ఇప్పటికే కేజ్రీవాల్ సాగునీటి సమస్యలపై చర్యలు తీసుకొవాలని కూడా కేజ్రీవాల్ ఆదేశాలను జారీ చేశారు. దీనిపై బీజేపీకి కూడా మండిపడుతుంది. ఇక.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడం సాగబోదన్నారు. దీనిపై ఆప్ మంత్రి అతీషి స్పందించారు. రాజ్యంగంలోని ఏ నిబంధన ప్రకారం.. లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఖచ్చితంగా ప్రతీకార రాజకీయాలానని ఆమె అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టాల ప్రకారం.. చట్టసభలోన సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందని కూడా మంత్రి అతీషీ అన్నారు. దర్యాప్తు సంస్థలు ఎలాంటి ఆధారాలు లేకున్న మనీలాండరీకంగ్ కింద కేసులు నమోదు చేస్తున్నాయని ఆమె అన్నారు. ఈ కేసులో అరెస్టు అయితే బెయిల్ దోరకదు. ఈ విధంగా అపోసిషన్ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె అన్నారు.

కేజ్రీవాల్ అరెస్టు వల్ల తమకే ప్రజల్లో సానూభూతి కల్గిందని, లోక్ సభ ఎన్నికలలో తమకే ప్రజలు పట్టం కడుతారని కూడా అతీశీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఆప్ నేతలు పెద్ద ఎత్తున నిరసలను చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలల్లో ఆప్ నేతలు.. కేజ్రీవాల్ మాస్క్ లు ధరించి వెల్ లో నిసనలు చేపట్టారు. అదే విధంగా దీనిపై బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. లోక్ సభ ఎన్నికల ముందుక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దర్యాప్తు సంస్థలు,ఈడీలను ఉసిగొల్పి రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు.

గతంలో దేశంలో అవినితీని, అన్యాయాలను తొలగిస్తామంటూ, నినాదంతో ఆప్ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో సీఎం కేజ్రీవాల్ ఎవరు అవినీతికి పాల్పడిన కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తెల్చిచెప్పారు. ఇక ప్రస్తుతం.. సీఎం కేజ్రీవాల్, సతీమణి సునీత మద్యం కుంభకోణంపై పలు వ్యాఖ్యలు చేశారు.

Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?

దీనిపై బీజేపీ మండిపడుతూ.. అప్పట్లో లాలు ప్రసాద్ యాదవ్ దాణాకుంభకోణం ఘటనలో, లాలు సతీమణి రబ్రీ దేవీ లాలుకు అనుకూలంగా ప్రకటనలు చేసేవారని గుర్తుచేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ సతీమణి కూడా అదే ఫార్మూలాను అమలు చేస్తున్నారని, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు .

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News