Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాపై మరో అభియోగం, దర్యాప్తు వేగం పెంచిన ఈడీ

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తాజాగా సంచలన విషయాన్ని బయటపెట్టింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2023, 03:08 PM IST
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాపై మరో అభియోగం, దర్యాప్తు వేగం పెంచిన ఈడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సిమ్ కార్డుల మార్పిడి, ఫోన్ల ధ్వంసంపై ఈడీ తాజాగా ఆరోపణలు చేసింది. అంతేకాకుండా మరి కొన్ని పేర్లను బయటపెట్టింది. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయ్యారు. ఈయనపై అటు సీబీఐ, ఇటు ఈడీ ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. ఇప్పుడు తాజాగా మరి కొన్ని అభియోగాలు మోపింది ఈడీ. ఈ కేసులో మనీష్ సిసోడియా 14 వేర్వేరు ఫోన్లలో మొత్తం 43 సిమ్ కార్డులు ఉపయోగించారని ఈడీ తెలిపింది. ఇందులో 5 సిమ్ కార్డులు సిసోడియా పేరు మీద ఉంటే..మిగిలినవి ఇతరుల పేర్లపై ఉన్నాయి. 

అంతేకాకుండా మనీష్ సిసోడియా ఐఫోన్ 13 మ్యాక్స్ ప్రోను 11 నెలలు వాడి, తరువాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల అనంతరం ధ్వంసం చేశారని ఈడీ తాజాగా అభియోగం మోపింది. ఈ కేసుకు సంబంధించి 14 వేర్వేరు స్మార్ట్‌ఫోన్లను వినియోగించారని పేర్కొంది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు, ఆధారాలు నాశనం చేసేందుకు ఆ ఫోన్లను ధ్వంసం చేశారని స్పష్టం చేసింది. ఈ కేసులో మొత్తం 43 సిమ్ కార్డుల్ని మనీష్ సిసోడియా వినియోగించినట్టు ఈడీ వెల్లడించింది.

ఈ ఫోన్లను దేవేందర్ శర్మ, సుధీర్ కుమార్, జావేద్ ఖాన్, రొమాడో క్లాత్స్ పేరిట కొనుగోలు చేసినట్టుగా ఉందంది ఈడీ. ఇందులో రొమాడో క్లాత్స్ కొనుగోలు చేసిచ్చిన చెక్ బౌన్స్ అయిందని ఈ వ్యవహారంపై కూడా కేసు నమోదైందని ఈడీ తెలిపింది.

సెప్టెంబర్ 2022లో మనీష్ సిసోడియాకు చెందిన వన్‌టైమ్ పాస్‌వర్డ్ పనికోసం దేవేందర్ శర్మ జావేద్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కొనుగోలు చేశారు. ఓటీపీ ఆధారిత మెస్సేజ్‌లను ఈడీ సేకరించలేకపోయింది. సిసోడియా ఈడీకు సమర్పించిన రెండు ఫోన్ల ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం సిసోడియా సిగ్నల్, వాట్సప్‌లను జూలై 23వ తేదీ 2023న రీఇన్‌స్టాల్ చేశారు.

Also read: GSLV F12 Success: జీఎస్ఎల్‌వి ఎఫ్ 12 విజయవంతం, ఇకపై స్వదేశీ నావిగేషన్, ప్రత్యేకతలివీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News