ED Searches in Cm Kejriwal Residence: ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు చివరి దశకు చేరుకున్నట్టు కన్పిస్తోంది. ఈ కేసులో ఇక మిగిలిన ఒకే ఒక్కరు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయనను అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీ కోసం..
ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో 12 మందితో కూడిన బృందం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హడావిడిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ 9 సార్లు సమన్లు పంపించినా ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈసారి అరెస్టు తప్పదనే సంకేతాలుండటంతో అత్యవసరంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాను విచారణకు సిద్ధమని, అరెస్టు నుంచి తప్పించాలని పిటీషన్ ద్వారా అభ్యర్దించారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ దశలో అలాంటి ఆదేశాలివ్వలేమని తేల్చిచెప్పింది. అంతే ..ఢిల్లీ హైకోర్టు నుంచి ఈ ఆదేశాలు వెలువడగానే ఈడీ రంగంలో దిగిపోయింది.
సెర్చ్ వారెంట్ తీసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకుని సోదాలు ప్రారంభించింది. కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. దాంతో అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి భారీగా ఆప్ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు మద్యంతర ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లీగల్ టీమ్ సుప్రీంకోర్టులో అత్యవసర పిటీషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
Also read: Delhi Liquor Scam: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు షాక్, ఈసారి అరెస్ట్ తప్పదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook