Farmer Protest: చలో ఢిల్లీకి తాత్కాలికంగా బ్రేక్.. రైతులతో కేంద్రం చర్చల్లో కీలక పరిణామం..

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీగా నిరసలు చేపట్టారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో చేరుకొవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బారికెడ్లు, సిమెంట్ దిమ్మెలు,  బాష్పవాయువులతో రైతుల్ని ఎక్కడిక్కడ ఆపేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 19, 2024, 12:49 PM IST
  • - ఆదివారం రాత్రి వరకు రైతులతో చర్చలు జరిపిన కేంద్రం..
    - నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న రైతులు..
Farmer Protest: చలో ఢిల్లీకి తాత్కాలికంగా బ్రేక్.. రైతులతో కేంద్రం చర్చల్లో కీలక పరిణామం..

Minister Piyush Goyal Comments After Sunday Meeting: ఢిల్లీలో రైతుల నిరసనలతో దేశ వ్యాప్తంగా మరోసారి ఈ ఘటన వార్తలలో నిలిచింది. ఇప్పటికే కేంద్రం, రైతులతో పలుదఫాలుగా చర్చించిన విషయం తెలిసిందే. అయిన కూడా .. రైతులు, కేంద్రం ముందు ఉంచిన డిమాండ్ మీద ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటికే.. పంజాబ్, హర్యానాలోని శంబువద్ద భారీగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

Read More: Shriya Saran: తెల్ల చీరలో శ్రియ శరన్ ఘాటు ఫోజులు.. ఇది మాములు డోసు కాదండోయ్..

హైవేల మీద రైతులు వంట వార్పులు చేసుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక కేంద్రం ఇప్పటికే మూడు సార్లు రైతులతో సమావేశం అయ్యింది. ఆదివారం తాజాగా, అర్దరాత్రి వరకు కేంద్రం తరపున.. అగ్రికల్చర్ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతునేతలతో చర్చించారు. పంజాబ్ సీఎం భగివంత్ మాన్ కూడా రైతులతో జరిగిన సమాదేశంలో పాల్గొన్నారు.

సమావేశం తర్వాత.. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్రిపంటలను ప్రభుత్వ ఏజెన్సీలు మినిమం సపోర్ట్ ప్రైజ్ కు కొనుగోలు చేస్తాయన్నారు.  
 కందులు, మినుములు, మైసూర్ పప్పు విషయంలో కూడా ఒప్పందాలు ఉంటాయన్నారు. కొనుగోలుపై ఎలాంటి పరిమితి ఉండదన్నారు. ప్రత్యేకంగా పోర్టల్ ను డెవలప్ చేస్తామన్నారు. దీనిపై రైతులు సోమ, మంగళవారం నిపుణులతో చర్చిస్తామని రైతునేత శర్వాన్ సింగ్ వెల్లడించారు.

Read More: Parenting Tips: మంచి ఆరోగ్యం కోసం పిల్లలకు రోజుకు ఎన్ని పిస్తాలు తినిపించాలో తెలుసా? నిపుణుల సూచన ఇదే..

ప్రస్తుతానికి చలో ఢిల్లీ హోల్డ్ లో పెట్టామని, ఆ తర్వాత డిమాండ్ లపై కేంద్రరం స్పందన ఆధారంగా ఫిబ్రవరి 21న మరోసారి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇప్పటికే కేంద్రం .. రైతులతో మూడు సార్లు సమావేశమయిన విషయం తెలిసిందే. కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు, రైతులు, కూలీలకు ఫించన్లు, రైతులపై నమోదైన కేసుల కొట్టివేత, భూసేకరణ పునరుద్ధరణ మొదలైన వాటిపై చర్యలు తీసుకొవాలన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x