Tear Gas Attack On Delhi Farmers: దేశ రాజధానిలో రైతులు మరోసారి కదం తొక్కారు. తమ డిమాండ్ లను నెరవేర్చేదాక నిరసన ఆపేది లేదని రైతులు తెల్చిచెప్పారు. ఈసారి ఎన్నినెలలైన కూడా వెనక్కు తగ్గేదిలేదని రైతులు భారీగా ఢిల్లీకి తరలివచ్చారు. ఉదయం నుంచి ట్రాక్టర్ లు, టూవీలర్ లు, లారీలలో ఢిల్లీకి చేరుకున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైతులు భారీగా ఢిల్లీ చేరుకున్నారు. దీంతో అనేక ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు కూడా ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడకుండా అనేక చోట్ల బారికెడ్లు, సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు.
#WATCH | Police use tear gas to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu border. pic.twitter.com/h5smXJ6ZX5
— ANI (@ANI) February 13, 2024
పంజాబ్, హర్యానాల మధ్య ఉన్న శంభు సరిహద్దు ప్రాంతంలో భారీగా రైతులు గుమిగూడారు. దీంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఆందోళనలు ఎక్కువగా కావడంతో పోలీసులు భాష్పవాయును ప్రయోగించారు. డ్రోన్లను ఉపయోగించి స్మోక్ బాంబ్స్ ను కూడా వేశారు. దీంతో నిరసన కారులు, పోలీసులు పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పంటపై కనీస మద్దతు ధర ఇవ్వడం, గతంలో చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులు కొట్టివేయడం, వంటి అనేక డిమాండ్లతో రైతులు తీవ్ర నిరసనలు చేపట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు భాష్పవాయువు షెల్స్, పోలీసుల చేతిలో సుదీమోనలు పట్టుకుని పహారా కాస్తున్నారు. ఈక్రమంలో రైతులు.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పై మండిపడ్డారు. రైతుల నడుస్తున్న బాటలో పోలీసులు మేకులు వేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా నిరసన వ్యతిరేక చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు.. "రైతుల బాటలో మేకులు వేయడం 'అమృతకాలా' లేదా 'అన్యాయ్కాలా'?.. అంటూ సెటైర్ లు వేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు అధికార బీజేపీపై దాడి చేస్తూ గాంధీ వాద్రా ఎక్స్‌లో ప్రశ్నించారు.. "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్!.. దేశంలోని రైతులతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చరు..." అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
Read More: Home Cleaning Tips: అరటిపండు తొక్కపై నిమ్మకాయను రాస్తే ఏమౌతుందో తెలుసా?
ఇక మరోవైపు రైతులు కూడా నిరసనల విషయంలో వెనక్కు తగ్గెది లేదని అంటున్నారు. గతంలో 13 నెలల వరకు వదలలేదు. మా డిమాండ్లను నెరవేరుస్తామని మాకు హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేదు. ఈసారి, మా డిమాండ్లన్నీ నెరవేర్చుకున్న తర్వాత మాత్రమే వెనక్కు వెళతామని రైతులు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook