డిగ్రీ ఇవ్వలేదని.. వైస్ ఛాన్సలర్ ఆఫీసుకి నిప్పంటించాడు..!

వడోదరాలోని మహారాజా సాయాజీరావ్ యూనివర్సీటిలో ఓ యువకుడు 2007లో డిగ్రీ ప్యాసయ్యాడు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో పట్టా కోసం దరఖాస్తు చేసుకోగా ఇవ్వడానికి విశ్వవిద్యాలయ యాజమాన్యం నిరాకరిచింది

Last Updated : Feb 3, 2018, 01:58 PM IST
డిగ్రీ ఇవ్వలేదని.. వైస్ ఛాన్సలర్ ఆఫీసుకి నిప్పంటించాడు..!

వడోదరాలోని మహారాజా సాయాజీరావ్ యూనివర్సీటిలో ఓ యువకుడు 2007లో డిగ్రీ ప్యాసయ్యాడు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో పట్టా కోసం దరఖాస్తు చేసుకోగా ఇవ్వడానికి విశ్వవిద్యాలయ యాజమాన్యం నిరాకరించింది. దాంతో కోపోద్రిక్తుడైన ఆ సదరు యువకుడు, వైస్ ఛాన్సలర్ ఆఫీసుకు వచ్చి.. అందరూ చూస్తుండగానే తలుపులను, గదిలోని సామాన్లను తగలబెట్టాడు.

తమ ఎదుటే ఈ సంఘటన జరగడంతో విద్యార్థులందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు పట్టించి.. మంటలను ఆపడానికి ప్రయత్నించారు విద్యార్థులు. ఈ యువకుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పూర్వ విద్యార్థైన ఆ విద్యార్థి ఇనేళ్ళ తర్వాత ఎందుకు యూనివర్సిటికి వచ్చి డిగ్రీ తీసుకెళ్లాలని భావించాడో కూడా అడిగి తెలుసుకున్నారు.

తాను గతంలో ఆ విశ్వవిద్యాయలంలో చదివేటప్పుడు హిందూ దేవతల చిత్రాలను నగ్నంగా గీశాడని.. దాంతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని యూనివర్సీటీ ప్రకటించిందని ఆ విద్యార్థి తెలిపాడు. అయితే ఆ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డిగ్రీ మంజూరు చేయకపోవడం దారుణమని తను తెలిపాడు. ఆ విద్యార్థి చెప్పేది నిజమా.. కాదా అన్న కోణంలో ఆలోచిస్తున్నామని తెలిపారు స్థానిక పోలీసులు.

Trending News