Odisha Covid News: దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కరోనా(Covid-19) కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, ఒడిశా, తెలంగాణల్లోని విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఒడిశా దెంకనల్(Dhenkanal)లోని కుంజకంట(Kunjakanta) ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ కళాశాల(Residential College)లో 33 మంది బాలికలకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..కాలేజీని డిసెంబర్ 10 వరకు మూసివేశారు. మెుదటగా నలుగురికి కొవిడ్ సోకింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మిగిలిన వారికి కూడా పరీక్షలు చేశారు. ఇందులో 33 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కళాశాలను పూర్తిగా శానిటైజ్(Sanitize) చేశారు అధికారులు. ఇంతమందికి వైరస్ సోకడంతో..విద్యార్థుల తల్లిదండ్రులు, నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read: Corona Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుండి మిమ్మల్ని కాపాడే పద్ధతులు
గతవారమే ఒడిశా(Odisha)లోని మయూర్ భంజ్ ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 26 మంది విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు. కర్ణాటక ధార్వాడ్‌లోని ఎస్డీఎమ్ వైద్య కళాశాలలో కరోనా కల్లోలమే సృష్టించిందని చెప్పాలి. అక్కడ 281 మంది విద్యార్థులకు కొవిడ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ 'ఒమ్రికాన్'(Omicron)కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో..కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వైరస్ ను ఎదుర్కొనేందుకు సన్నదమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook