PK and Sarad Pawar: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి వార్తల్లోకెక్కారు. సీనియర్ రాజకీయ నాయకుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీనే దీనికి కారణం. ఇంతకీ ఈ ఇద్దరి భేటీ వెనుక కారణమేంటి, ఏ విషయాలపై చర్చ సాగిందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఎన్నికల వ్యూహకర్తగా పశ్చిమ బెంగాల్ విజయం అనంతరం మరోసారి వార్తల్లోకెక్కారు ప్రశాంత్ కిశోర్( Prasant Kishor). నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌తో ముంబైలో భేటీ అయ్యారు. నాలుగు గంటల సేపు ఇద్దరి మధ్య జరిగిన చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. 2024లో జరిగే సాధారణ ఎన్నికలే అజెండాగా చర్చ సాగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మిషన్ 2024 (Mission 2024) కోసం ఇప్పట్నించి సిద్ధమవుతున్నారని ఇప్పటికే పలువురు అంచనా వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకు దీటుగా ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టే విషయం, ఎన్నికల్లో అనురించాల్సిన వ్యూహంపై ఇద్దరూ చర్చించుకున్నట్టు సమచారం. అయితే తాను ప్రతి రాజకీయ నేతను కలుస్తానని..అభిప్రాయలు తెలుసుకోవడంలో తప్పులేదని ప్రశాంత్ కిశోర్ చెప్పడం గమనార్హం.
ఎన్సీపీ (NCP) సీనియర్ నేత నవాబ్ మాలిక్ మాత్రం రాజకీయభేటీ కాదంటున్నారు. ఇద్దరి భేటీ మర్యాదపూర్వక కలయిక మాత్రమేనని..ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ నియామకం గురించి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. తన అనుభవాన్ని పవార్ సాబ్‌తో పంచుకున్నారు..పవార్ (Sarad Pawar) ప్రతిపక్ష పార్టీల్ని ఏకం చేయాలనుకుంటున్నారు..బీజేపీకు ప్రత్యామ్నాయంగా రానున్న రోజుల్లో బలమైన రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనేది పవార్ కోరిక అంటూ నవాబ్ మాలిక్ ముక్తాయింపు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల (West Bengal Elections) అనంతరం ఇకపై ఏ రాజకీయ పార్టీకు పనిచేయనని ప్రశాంత్ కిశోర్ చెప్పిన తరువాత ఈ భేటీ జరగడం ఆసక్తి రేపుతోంది.
Also read: Sonu Sood: సోనూసూద్ మరో సంచలన నిర్ణయం, పేదవారి కోసం ఉచిత ఐఏఎస్ కోచింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook