Dr Subhash Chandra Success Secrets: విద్యార్థులకు డా సుభాష్ చంద్ర సక్సెస్ సీక్రెట్స్

Dr Subhash Chandra Success Secrets: గతం గురించి చింతనపడటం, భవిష్యత్ గురించి ఆందోళన చెందడం మానేసి వర్తమానంలో ఉండి జీవితాన్ని ఆస్వాదించండి అని అన్నారు ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డా సుభాష్ చంద్ర. వర్తమానంలో ఉండి జీవిత సత్యాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో సగం బాధలు వాటంతట అవే తొలగిపోతాయని డా సుభాష్ చంద్ర అభిప్రాయపడ్డారు.

Written by - Pavan | Last Updated : May 21, 2022, 09:59 PM IST
  • వర్తమానంలో ఉండి జీవిత సత్యాన్ని అర్థం చేసుకోండి
  • తన జీవితంలోని స్వీయ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్న ఎస్సెల్ గ్రూప్ చైర్మన్
  • విద్యార్థులకు డా సుభాష్ చంద్ర 'సక్సెస్ మంత్ర'
Dr Subhash Chandra Success Secrets: విద్యార్థులకు డా సుభాష్ చంద్ర సక్సెస్ సీక్రెట్స్

Dr Subhash Chandra Success Secrets: గతం గురించి చింతనపడటం, భవిష్యత్ గురించి ఆందోళన చెందడం మానేసి వర్తమానంలో ఉండి జీవితాన్ని ఆస్వాదించండి అని అన్నారు ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డా సుభాష్ చంద్ర. వర్తమానంలో ఉండి జీవిత సత్యాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో సగం బాధలు వాటంతట అవే తొలగిపోతాయని డా సుభాష్ చంద్ర అభిప్రాయపడ్డారు. ముంబైలోని మౌంట్ లిటెరా ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన '' డేర్ టూ డ్రీమ్ '' అనే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మౌంట్ లిటేరా నుండి 2022లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకుని వెళ్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పిన డా సుభాష్ చంద్ర... గ్రాడ్యూయేషన్ విద్య కోసం మౌంట్ లిటేరాపై విశ్వాసంతో తమ పిల్లలను ఇక్కడికి పంపించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే వేదికపై విద్యార్థులకు డా సుభాష్ చంద్ర సక్సెస్ సూత్రాలను ఉపదేశించారు.

ఈ సందర్భంగా డా సుభాష్ చంద్ర తన జీవితంలోని స్వీయ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. 1926, మే 21న.. అంటే సరిగ్గా 96 ఏళ్ల క్రితం ఇదే రోజున తమ ముత్తాత ఈ కంపెనీని స్థాపించారని గుర్తుచేసుకున్నారు. వ్యాపారంలో తమ కుటుంబం ఎన్నో ఆటుపోట్లను చూసిందని అన్నారు. కష్టాలు ఎక్కడైనా, ఎవరి జీవితంలోనైనా ఉంటాయని ఆ ఒడిదుడుకుల వల్లే నేర్చుకున్నామని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ కష్టపడితేనే ఎన్నో నేర్చుకుంటారని విద్యార్థులకు వివరిస్తూ వారిలో పోరాట పటిమను, స్పూర్తిని నింపే ప్రయత్నం చేశారు డా సుభాష్ చంద్ర (Dr Subhash Chandra). 

ముంబైలోని లిటెరా స్కూల్ ఇంటర్నేషనల్ నుంచి ప్రస్తుతం రెండో బ్యాచ్‌కి చెందిన విద్యార్థులు గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న వెళ్తున్న సందర్భంగా ఈ ఈవెంట్ నిర్వహించారు. గతేడాది కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఎలాంటి సంబరాలు నిర్వహించలేదు. దీంతో మొట్టమొదటిసారిగా నేడు మౌంట్ లిటేరా స్కూల్ ఇంటర్నేషనల్‌లో ఈ ఈవెంట్ చేపట్టినట్టు విద్యా సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Also read : Petrol Prices, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం

Also read : KCR-Akhilesh Meet: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్, ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ప్రత్యేక భేటీ దృశ్యాలు

Trending News