Female Cheetah Dies At Kuno: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా మృతి చెందింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన దక్ష అనే ఆడ చీతాపై రెండు మగ చీతాలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన చీతాకు అధికారులు చికిత్స అందిస్తున్న సమయంలో మధ్యాహ్నం 12 గంటలకు దక్ష ప్రాణాలు వదిలేసింది. దాదాపు 40 రోజుల వ్యవధిలో పార్కులో మరణించిన మూడో చిరుత దక్ష. వాయు మరియు అగ్ని అనే రెండు మగ చీతాలు సంభోగ సమయంలో ఆడ చీతాపై దాడి చేశాయని మధ్యప్రదేశ్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ తెలిపారు. పునరుత్పత్తి కోసం దక్షను రెండు మగ చీతాల ఉన్న ఎన్‌క్లోజర్‌లో ఉంచారు.
ప్రొటోకాల్ ప్రకారం, చిరుత శవపరీక్షను వెటర్నరీ బృందం నిర్వహిస్తోంది. 'ప్రాజెక్ట్ చిరుత' కింద నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇప్పటి వరకు 20 చీతాలను భారత్ దిగుమతి చేసుకుంది. ఇందులో సాషా అనే చీతా కిడ్నీ వ్యాధి కారణంగా ఈ సంవత్సరం మార్చి 27న మృతి చెందింది. ఏప్రిల్ 23న ఉదయ్ అనే మగ చీతా మరణించింది. తాజాగా దక్ష అనే చీతా ప్రాణాలు విడిచింది.
మన దేశంలో చీతాలు 74 ఏళ్ల కిందటే అంతరించిపోయాయి. 1947లో దేశంలోని చివరి చీతా ఛత్తీస్ గఢ్ లో చనిపోయింది. దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ఇతర దేశాలను నుంచి చీతాలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా గతేడాది సెప్టెంబరు 17న నమీబియా నుంచి 8 చీతాలను భారత్ దిగుమతి చేసుకుంది ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చింది.
Also Read: Madhya Pradesh: బ్రిడ్జి పై నుంచి పడిన ప్యాసింజర్ బస్సు.. 15 మంది దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook