FIR on Amitabh Bachchan And KBC 12: అమితాబ్ బచ్చన్, కేబీసీ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్

FIR on Amitabh Bachchan and KBC 12 | ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’పై వివాదం చెలరేగింది. చివరి కేబీసీపై కేసు నమోదు వరకు వెళ్లింది. గత వారం కరమ్‌వీర్ ఎపిసోడ్‌లో భాగంగా అడిగిన ఓ ప్రశ్న ఆ వివాదానికి కారణమైంది. ఆ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కేబీసీ ఇప్పుడు కౌన్ బనేగా కమ్యూనిస్టుగా మారిపోయిందని సెటైర్లు సైతం వేశారు.

Last Updated : Nov 3, 2020, 02:56 PM IST
  • అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’
  • గత వారం కరమ్‌వీర్ ఎపిసోడ్‌లో అడిగిన ఓ ప్రశ్న ఆ వివాదానికి కారణమైంది
FIR on Amitabh Bachchan And KBC 12: అమితాబ్ బచ్చన్, కేబీసీ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati)పై వివాదం చెలరేగింది. చివరికి కేబీసీపై కేసు నమోదు వరకు వెళ్లింది. గత వారం కరమ్‌వీర్ ఎపిసోడ్‌లో భాగంగా అడిగిన ఓ ప్రశ్న ఆ వివాదానికి కారణమైంది. సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్, యాక్టర్ అనుప్ సోనిలను మనుస్మృతిపై కేబీసీ 12లో భాగంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఆ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై కేబీసీ 12 నిర్వాహకులు, నటుడు అమితాబ్ బచ్చన్‌లపై లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. రూ.6,40,000కు సంబంధించి.. బెజవాడ విల్సన్, అనుప్ సోనిలను ఈ ప్రశ్న అడిగారు. 25 డిసెంబర్ 1927లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన అనుచరులతో కలిసి ఏ రచనల్ని దహనం చేశారు? అని బిగ్ బీ అమితాబ్ అడిగారు. ఏ. విష్ణు పురాణం బి. భగవద్గీత సి. రుగ్వేదం డి. మనుస్మృతి ఆప్షన్లుగా ఇచ్చారు. దీనికి వారు ఆప్షన్ డి అని సరైన సమాధానం చెప్పారు. 

 

 

మనుస్మృతి సరైన సమాధానం అని ప్రకటించిన అమితాబ్.. హిందూ గ్రంథం మనుస్మృతిని బీఆర్ అంబేడ్కర్ వ్యతిరేకించారని, అందుకే దహనం చేశారని కంటెస్టెంట్స్‌కు వివరణ ఇచ్చారు. ఇక అది మొదలుకుని బాయ్‌కాట్ కేబీసీ అని ట్రెండ్ చేస్తున్నారు. మరికొందరైతే కేబీసీ ఇప్పుడు కౌన్ బనేగా కమ్యూనిస్టుగా మారిపోయిందని సెటైర్లు సైతం వేశారు. అంబేడ్కర్ హిందువులకు వ్యతిరేకం కాదని, అయితే కులాలు, వర్ణవ్యవస్థ విధానాలకు మాత్రమే ఆయన వ్యతిరేకి అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News