Flight Toilet Case: ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో మహిళపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు బెంగళూరు నుంచి అరెస్ట్ చేశారు. బెంగుళూరు నుంచి నిందితుడిని పోలీసులు ఢిల్లీకి తీసుకొచ్చారు. శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణ నిమిత్తం పోలీసులు రిమాండ్ కోరనున్నారు. విమానంలో మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించిన శంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇలా..
గతేడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న శంకర్ మిశ్రా అనే వ్యక్తి రాత్రి సమయంలో తాగి వచ్చి 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఆమె దుస్తులు, బూట్లు, హ్యాండ్ బ్యాగ్ మొత్తం మూత్రంతో తడిసిపోయాయి. అప్పుడు ఎయిర్ ఇండియా సిబ్బందికి ఫిర్యాదు చేస్తే.. వాళ్లు ఆమెకు పైజామా, స్లిప్పర్స్ ఇచ్చి పంపించారు. మహిళను మళ్లీ సీట్లో కూర్చొబెట్టారు. మూత్ర వాసన వస్తుందని చెప్పినా.. ఆమెను వాళ్లు అదే సీట్లు కూర్చొబెట్టారు. మూత్రం పోసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధిత మహిళ సంస్థ ఛైర్మన్ చంద్రశేఖర్‌కు లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఎయిర్ ఇండియా దిగివచ్చింది. నిందితుడిపై 30 రోజులు ఎయిర్ లైన్ నిషేధం విధించింది. ఈ ఘటనపై పోలీలసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 354, 294, 509, 510 కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిందితుడు శంకర్ మిశ్రా పరారీలో ఉన్నాడు. ఢిల్లీ పోలీసులు శంకర్ మిశ్రా ఆచూకీ కోసం లొకేషన్ ట్రేస్ చేశారు. బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి.. శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.
శంకర్ మిశ్రాపై తీవ్రమైన ఆరోపణల రావడంతో అతను పనిచేస్తున్ కంపెనీ వోల్ఫ్ ఫార్గో ఉద్యోగం నుంచి తొలగించింది. కంపెనీ తరపున ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తమ ఉద్యోగుల నుంచి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మంచి ప్రవర్తనను ఆశిస్తుందని తెలిపింది. శంకర్‌పై వచ్చిన ఆరోపణలు చాలా కలవరపెడుతున్నాయని.. దీంతో అతడిని కంపెనీ నుంచి తొలగించినట్లు వెల్లడించింది. ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తామని కూడా కంపెనీ తెలిపింది.
మరోవైపు నిందితుడు శంకర్ మిశ్రా ముందస్తు బెయిల్ కోసం సిద్ధమయ్యాడు. శంకర్ మిశ్రా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోబోతున్నాడు. ఈ వ్యవహారంపై నిందితుడి తరపు న్యాయవాదులు అతని వాంగ్మూలాన్ని వినిపించారు. ఈ సంఘటన తర్వాత మహిళ శంకర్‌ను క్షమించిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్‌లోని చాట్ ద్వారా చూపించారు. మహిళకు సంబంధించిన దుస్తులను శంకర్ ఉతికి పంపించాడని.. నష్టపరిహారంగా రూ.15 వేలు కూడా ఇచ్చారని అందులో పేర్కొన్నారు. అయితే ఆమె కూతురు జోక్యం చేసుకుని డబ్బులు వెనక్కి పంపించిందని వాంగ్మూలంలో పేర్కొన్నారు. విమానయాన సంస్థ నుంచి పరిహారం పొందేందుకే మహిళ ఫిర్యాదు చేసినట్లు ఆరోపించారు.
Also Read: Prabhas Broke into Tears: షోలో కన్నీటి పర్యంతం అయిన ప్రభాస్, బాలకృష్ణ.. హగ్ చేసుకుని మరీ!
Also Read: Tunisha Sharma Death: తునీషా శవమై ఉంటే సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ తో షీజాన్ ఛాటింగ్.. గంట పాటు అలాగే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook