TamiliSai Soundararajan: డబ్బులు లేకనే ఐదు సార్లు ఓడిపోయా.. సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళి సై..

TamiliSai Soundararajan:తెలంగాణా మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల బరిలో నిలబడిన తమిళిసై ఐదుసార్లు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 29, 2024, 04:07 PM IST
  • ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేసిన తమిళిసై..
  • తన దగ్గర డబ్బులు లేవంటూ వ్యాఖ్యలు..
TamiliSai Soundararajan: డబ్బులు లేకనే ఐదు సార్లు ఓడిపోయా.. సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళి సై..

TamiliSai Soundararajan Sensational Comments On Money Distribution In Elections: దేశంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకపైపు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ను విడదల చేసింది. మరోవైపు ఈడీ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే క్రమంలో.. తెలంగాణ,పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై ఎన్నికలలో పోటీ చేయడానికి గాను... గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. తమిళిసై తెలంగాణ గవర్నర్ గా ఉన్నప్పుడు.. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ గా ఉండేది. అప్పటి సీఎంకేసీఆర్, బీఆర్ఎస్ నేతలు.. తమిళిసై బహింరంగంగానే అనేక వ్యాఖ్యలు చేశారు.

Read More: Snake Attack: పాముతో లిప్ లాక్ కోసం ట్రైచేశాడు.. ట్విస్ట్ మాములుగా లేదుగా..అసలేం జరిగిందంటే..?

తమిళిసై కూడా అంతే రివర్స్ ల కౌంటర్ అటాక్ చేసేవారు.అప్పట్లో తమిళిసై, కేసీఆర్ కు మధ్యన ఉన్న బేధాభిప్రాయాలు అందరు గమనించే వారు. ఈ క్రమంలో తెలంగాణలో కొత్తగా సీఎం రేవంత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కొలువుతీరింది. ఇక.. నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ కు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారాను మోగించింది. దీంతో తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యక్ష  రాజకీయాల్లో పోటికి దిగాలనే గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.

అప్పటికే బీజేపీ పెద్దలతో ఉన్న మంచి పరిచయాలు, గతంలో బీజేపీ అనేక హోదాలలో తమిళి సై సేవలందించారు. దీంతో బీజేపీ ఆమెకు గ్రీన్ కార్పెట్ వేసింది. ఇదిలా ఉండగా బీజీపీ నుంచి ఆమె చెన్నై సౌత్ నుంచి ఎన్నికల బరిలో నిలబడ్డారు. ప్రస్తుతం తమిళి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో పలు పార్టీలనేతలు ఆమెను తరచుగా ఐదుసార్లు ఓడిపోయావంటూ చులకనగ మాట్లాడేవారు. ప్రజల్లో తమిళికి ఆదరణ లేదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆదరణ ఉంటే ఆమె ఒక్కసారైన గెలిచి ఉండేవారని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తమిళి సై దీనిపై తాజాగా స్పందించారు.

Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?

ప్రస్తుతం చెన్నై సౌత్ లోని పలు ప్రాంతాలలో తమిళిసై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు తానుగతంలో ఎన్నికలలో ఐదుసార్లు ఓడిపోవడంపై క్లారిటి ఇచ్చుకున్నారు. తమిళి సై ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. గత ఎన్నికలలో ఖర్చులు పెట్టలేక, తనవద్ద డబ్బులు లేకపోవడం వల్లనే ఎన్నికలలో ఓడిపోయానంటూ ఆమె అన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలలో ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓటు వేయమని అడుగుతారా ..?.. అంటూ అపోసిషన్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News