మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాలో ఈ రోజు తెల్లవారు ఝామున భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రతకు ఓ ఇల్లు కూలడంతో అందులో నివాసముంటున్న 55 ఏళ్ల వృధుడు మరణించాడు. కాగా 50 ఏళ్ల అతని భార్యకు స్వల్పగా గాయాలయ్యారు. విషయంలో తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ ఘటనా స్థలానికి వచ్చి కుప్పకూలిన ఇంటిని పరిశీలించారు. బాధిత కుంటుబానికి ఆర్ధిక సాయం అందేలా చూస్తుమని హామీ ఇచ్చారు.
కాగా భూకంపం వచ్చిన సందర్భంలో అందరూ గాఢ నిద్రలో ఉండటంలో ఈ విషయంలో ఎవరికీ అంతగా తెలియలేదు. తెల్లవారు ఝామున చెల్లాచెదురుగా ఉన్న పరిస్థితి గమనించిన స్థానికులకు భూకంపం అని అనుమానం వచ్చింది. అధికారుల నిర్ధారించుకున్న తర్వాత భూకంపం సంభవించదనే విషయం బయట ప్రపంచానికి తెలిసి వచ్చింది.
తెల్లవారుఝామున 1:03 నుంచి 1:15 వరకు సమయంలో నాలుగు సార్లు భూమి కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. రిక్టర్ స్కేల్ పై 3.8 , 3.6, 2.9 , 2.8 గా నమోదైనట్లు తెలిపారు. తీవ్రత తక్కువ కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. గత నాలుగు నెలల వ్యవధిలో ఈ ప్రాంతంలో భూకంపం రావడం రెండో సారి కావడం గమనార్హం. గత సారి సంబవించిన భూకంపం ధాటికి రెండేళ్ల చిన్నారి మరణించింది.