Aishwarya Rai's fake passport: ఐశ్వర్యరాయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో ముగ్గురు విదేశీయుల అరెస్ట్.. 1.80 కోట్ల మోసం!

Fraudsters arrested with Aishwarya Rai's fake passport:  నటి ఐశ్వర్యరాయ్ నకిలీ పాస్‌పోర్టు సహా అనేక మంది నటీనటుల పాస్‌పోర్టలు కలిగి ఉన్న ముగ్గురు విదేశీ సైబర్ నేరగాళ్లను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 17, 2022, 03:40 PM IST
Aishwarya Rai's fake passport: ఐశ్వర్యరాయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో ముగ్గురు విదేశీయుల అరెస్ట్.. 1.80 కోట్ల మోసం!

Fraudsters arrested with Aishwarya Rai's fake passport: తాజాగా నోయిడా పోలీసులు ముగ్గురు విదేశీ సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు వేల ఒరిజినల్ డాలర్లు, 1.3 మిలియన్ల నకిలీ డాలర్లు, 10 వేల 500 పౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సదరు నిందితుల నుంచి నటి ఐశ్వర్యరాయ్ నకిలీ పాస్‌పోర్టులు, ఆరు మొబైల్స్, 11 సిమ్‌లు, ల్యాప్‌టాప్, ప్రింటర్, పెన్ డ్రైవ్, 3 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కరుడుకట్టిన నేరస్తులు తమ సహచరులతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడేవారని అంటున్నారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌గా మారి ప్రజలను మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడేవారు. కస్టమ్ ఆఫీసర్‌లుగా మారి జనం నుంచి డబ్బు దోచేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పుడు తాజాగా పోలీస్ స్టేషన్ బీటా-2 పరిధిలో నివసించే రిటైర్డ్ కల్నల్‌ను టార్గెట్ చేసుకున్నారు.

క్యాన్సర్‌ మందుల కొనుగోలు పేరుతో రూ.కోటి 81 లక్షలు మోసం చేశారని కల్నల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించి నిందితులని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పట్టుకున్న నిందితులను ఐకే ఉఫెరెమ్‌వుక్వే, ఎడ్విన్ కొల్లిన్స్, ఓకోలోయ్ డామియన్‌లుగా గుర్తించారు. గ్రేటర్ నోయిడాలోని రాంపూర్ మార్కెట్ సమీపంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

నిందితులు పెద్ద పెద్ద సెలబ్రిటీల నకిలీ పాస్‌పోర్టులను కూడా తయారు చేసేవారని, ఈ కరుడుకట్టిన నేరస్తులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడే వారని అంటున్నారు. వీరు మ్యాట్రిమోనియల్ సైట్, డేటింగ్ యాప్ వంటి అనేక రకాలుగా ద్వారా ఈ నేరగాళ్లు ప్రజలను ట్రాప్ చేసేవారని పోలీసులు తెలిపారు.

అంతే కాకుండా లాటరీ వచ్చిందని మోసం, ఫేస్‌బుక్ ఫ్రెండ్‌గా మారి మోసం చేయడం, విదేశాల నుంచి పార్శిల్స్ పంపిస్తామంటూ కస్టమ్ ఆఫీసర్‌లుగా మారి మోసం చేయడం, సైబర్‌క్రైమ్‌లు అనేవి చేసేవారని గుర్తించారు. పేరుమోసిన విదేశీ ఫార్మా కంపెనీ ప్రతినిధి కావడంతో చౌకధరలకు వనమూలికలను కొనుగోలు చేసి, ఖరీదైన ధరలకు విక్రయిస్తామంటూ ప్రజలను మోసం చేసేవారని దాని సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారని తెలుస్తోంది. 
Also Read: 12 Years Boy Heart Attack: 12 ఏళ్ల విద్యార్థికి గుండెపోటు.. స్కూల్‌ బస్సులోనే మృతి! కారణం కరోనా మహమ్మారే

Also Read: Man Raped Dog: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News