Lok Sabha Polls 2024: బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తనను రాజకీయ విధుల నుంచి తప్పించాలని శనివారం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. ఇది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిని బట్టి చూస్తే గౌతమ్ క్రియాశీల రాజకీయాల నుంచి దూరం కానున్నాడని అర్థమవుతోంది. రీసెంట్ గా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల (Lok Sabha Candidates) జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే ఈ లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సుమారు వందకు పైగా క్యాండిడెట్స్ తో ఈ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
గంభీర్ ట్వీట్ లో ఏముందంటే.. ‘‘క్రికెట్ బాధ్యతల ఉన్న నేపథ్యంలో.. నన్ను రాజకీయ విధుల నుంచి తప్పించమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరాను. ఢిల్లీ తూర్పు లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు. జై హింద్'' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 2019లో గంభీర్ బీజేపీ పార్టీలో చేరాడు. ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలుపొందాడు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెలలోనే ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. ఈ సీజన్ కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా గంభీర్ వ్యవహారిస్తున్నాడు.
Also Read: Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ దంపతులు, పిక్స్ వైరల్
Also Read: PKL 2024: పీకేఎల్ పదో సీజన్ విజేతగా పల్టాన్.. ఫైనల్లో హరియాణాపై గెలుపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook