బంగారం ధర కొండెక్కి కూర్చుంటోంది. విదేశీ మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో ఇండియన్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం ధర పైపైకి ఎగబాకుతోంది. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.31,450వుండగా 22 క్యారట్ల బంగారం ధర రూ.29,200గా వుంది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో బంగారం ధర మరింత అధికంగా వున్నట్టు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ ముంబైలో 24 క్యారట్ల (10 గ్రాములు) బంగారం ధర 31,732 కాగా 22 క్యారట్ల బంగారం ధర 29,670 వద్ద కొనసాగుతోంది. గత 14 నెలల్లో ఇదే అత్యధిక ధరగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మునిచ్ చేసిన వ్యాఖ్యల పుణ్యమా అని గత మూడేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా డాలర్ బలహీనపడటం కూడా బంగారం ధరకు రెక్కలు రావడానికి మరో కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర పెరుగుతుండటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిణామమే.
భగ్గుమంటున్న బంగారం ధర !