Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలలో పోటీ పడుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్ట ధరలను టచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా సమయంలోనూ ధరలు పెరిగాయి తప్పా తగ్గడం లేదు.

Last Updated : Jul 20, 2020, 09:39 AM IST
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) పెరిగాయి. వెండి ధర సైతం బంగారం దారిలోనే పయనించింది. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.190 బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,330కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,040 వద్ద ట్రేడ్ అవుతోంది. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ధరల కంటే తక్కువగానే నమోదవుతున్నాయి. నేటి మార్కెట్‌లో రూ.210 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,110గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,910 వద్ద మార్కెట్ అవుతోంది. మోడల్ Shweta Mehta Hot Photos వైరల్

బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి అత్యధిక ధర గత వారం నమోదు చేసింది. కాగా, నేడు వెండి ధర కేవలం రూ.100 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.52,910కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

 

Trending News