Gold Price will Decrease: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. జూన్ 19 నుండి తగ్గనున్న గోల్డ్ ధరలు

Gold Price from twill Decrease from the Next Week: యూఎస్‌లో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బంగారు కొనుగోలు చేసేవారు ఈ వారం కొనుగోలు చేస్తే తక్కువ ధరకే పొందవచ్చు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 20, 2023, 06:27 PM IST
Gold Price will Decrease: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. జూన్ 19 నుండి తగ్గనున్న గోల్డ్ ధరలు

Gold Today Price will Decrease form June 19 2023: గత నెలలో పెరిగిన బంగారు ధరలు ఈ నెలలో తగ్గుతూ వస్తున్నాయి. ఈ వారం కూడా బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయి. గత కొన్ని రోజులుగా 10 గ్రాముల బంగారానికి రూ.60,000 మధ్య ధరల్లో విక్రియించిగా..శుక్రవారం రూ.59,492కి చేరింది. ఈ వారం 10 గ్రాముల బంగారం ధర మరింత తగ్గే అవకాశాలున్నాయని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) తెలిపింది. 

పోయిన వారంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
IBJA రేట్ల ప్రకారం.. ఈ వారం మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం బంగారం ధరలు రూ.59,834 ఉండగా.. మంగళవారం ధరలో స్వల్ప మార్పులు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. 59,772 వద్ద ముగిసింది. బుధవారం రోజు బంగారం ధర రూ.59,347, గురువారం 10 గ్రాములు రూ.59,020లకు విక్రయాలు జరిగాయి. ఇక శుక్రవారం బంగారం ధరలో స్వల్ప మార్పులు వచ్చాయి. 10 గ్రాము పసిడికి పెరిగి రూ.59,492 వద్ద ముగిసింది. ఈ వచ్చే వారం మరింత తగ్గే అవకాశాలున్నాయని IBJA సూచిస్తోంది. 

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

బంగారం మరింత చౌకగా మారే ఛాన్స్‌?
గత వారం చివరి ట్రేడింగ్‌ రోజు రూ.468 తగ్గి..రూ.59,960లకు మర్కెట్‌లో విక్రియించారు. ఈ వారం మరింత తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. US బ్యాంకింగ్ సంక్షోభం, ఆర్థిక మాంద్యం కారణంగా భారత్‌లోని బంగారం ధరలపై ప్రభావం పడుతుందని.. దీంతో పసిడి ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్‌లోని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు స్వల్ప తగ్గింపు లభించినప్పటికీ..రానున్న రోజుల్లో మరోసారి బంగారం ధరలు 60 వేల రూపాయలను తాకవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

24 క్యారెట్ల బంగారం ధర:
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం.. జూన్ 16న గరిష్టంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,582కి మార్కెట్‌లో విక్రయాలు జరిగాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికొస్తే.. రూ.59,343గా ఉంది.

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News