ఏం తినేట్టు లేదు ఏం కొనేట్టు లేదు... అంటూ ఒక పాట ఉంది. ఆ పాట ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సెట్ అయ్యేలా ఉంది. టమాటా కేజీ రెండు వందల రూపాయలు ఉంది. ఉల్లిగడ్డ ధర మెల్ల మెల్లగా పెరుగుతూ ఉంది. ఏ కూరగాయలను చూసినా కూడా కేజీ వంద రూపాయల ధర పలుకుతున్నాయి. కొన్ని అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి.
చికెన్ ఇప్పుడు కాస్త పర్వాలేదు కానీ మొన్నటి వరకు బాబోయ్ కోడి ని కొనడం కష్టం అన్నట్లుగా ఉంది. ఇక సామాన్యులకు అందనంత దూరంలో మటన్ ధర ఉంది. ఇలాంటి సమయంలో పాల ధరలు కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సామాన్యుల మీద ముఖ్యంగా పేదల పై పెద్ద భారం వేసినట్లుగా పరిస్థితి మారింది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పాల ధరను లీటర్ కి రూ.3 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నందిని పాలు అమ్ముతూ ఉంటారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉత్పత్తులు అన్నింటిని కూడా నందిని పేరుతో మార్కెట్ లో విక్రయిస్తూ ఉంటారు.
ఇతర బ్రాండ్స్ కూడా అమ్ముతూ ఉంటారు కానీ వాటి ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం అందిస్తున్న నందిని పాలు.. ఇతర డైరీ ఉత్పత్తులను పేదలు కొనుగోలు చేసి వినియోగిస్తూ ఉంటారు. అలాంటి నందిని పాలను ఇప్పుడు ధర పెంచి అమ్మబోతున్నట్లుగా స్వయంగా రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
Also Read: Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ టీమ్ రెడీ.. బండి సంజయ్‌కు ప్రమోషన్
ముఖ్యమంత్రి సిద్దరామయ్య తో పాటు అందరు మంత్రులు కూడా పాల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేటు పెంపుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పాల ధర రూ.54 నుంచి రూ.56 వరకు ఉంది. అందుకే కర్ణాటక రైతుల కోసం రూ.39 ఉన్న ధరను రూ.42 కి పెంచడం జరిగింది.
ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో టోన్డ్ మిల్క్ ను రూ.56 లకు అందిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రజల అవసరాలు నిమిత్తం తక్కువ రేటుకు అందిస్తున్నాం. రైతుల విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు.
రైతులను ఆదుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు. ఏప్రిల్ నెలలో గుజరాత్ లో పాల ధరలు పెరుగగా ఇప్పుడు కర్ణాటకలో పాల ధరలు పెరిగాయి. ముందు ముందు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Jampanna Vagu: జంపన్నవాగు మహోగ్రరూపం.. 8 మంది జలసమాధి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి