టీవీ చానళ్లలో కండోమ్ యాడ్స్ ప్రసారం చేయవద్దు

Last Updated : Dec 12, 2017, 01:50 PM IST
టీవీ చానళ్లలో కండోమ్ యాడ్స్ ప్రసారం చేయవద్దు

కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశంలో ఉన్న అన్ని టీవీ చానళ్లకు కండోమ్ ప్రకటనలు ప్రసారం చేయవద్దంటూ కఠిన ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు అన్ని టీవీ చానళ్లకు కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు పంపింది. ముఖ్యంగా పిల్లల మీద ప్రభావం, ఆనారోగ్య పద్ధతులు సృష్టించగలవంటూ అందులో పేర్కొంది.

కొన్ని చానళ్లు పదే పదే కండోమ్ ప్రకటనలను ప్రసారం చేస్తున్నాయి. ఇవి ముఖ్యంగా పిల్లలకు అభ్యంతరకరంగా ఉన్నాయి. కనుక ప్రసారం చేయవద్దు. లేకపోతే కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్, 1994 చట్టాన్ని ప్రయాగించాల్సి వస్తుందని హెచ్చరించింది.

ప్రకటనలు చేయవద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ.. కొన్ని చానళ్లు ఈ తరహా ప్రకటనలు చేస్తున్నాయి. పద్ధతి మార్చుకోండి. లేకపోతే కఠిన చర్యలు తప్పవు. ఇకపై ఉదయం 6 గంటల నుండి రాత్రి 10  గంటలవరకు కండోమ్ యాడ్స్ ప్రసారం చేయవద్దు అంది. ఒకవేళ ప్రసారం చేయాల్సి వస్తే.. రాత్రి 10 నుండి ఉదయం 6 గంటలవరకు మాత్రమే ప్రసారం చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.

Trending News