Gujarat High Court: బెయిల్ వచ్చినా మూడేళ్లుగా జైళ్లోనే, గుజరాత్ హైకోర్టు ఆగ్రహం

Gujarat High Court: చాలా సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా కొందరు మూల్యం చెల్లించుకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంటోంది. అలాంటిదే ఓ నిర్లక్ష్యం ఫలితం ఓ వ్యక్తికి మూడేళ్లు స్వేచ్ఛ దూరమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2023, 09:48 AM IST
Gujarat High Court: బెయిల్ వచ్చినా మూడేళ్లుగా జైళ్లోనే, గుజరాత్ హైకోర్టు ఆగ్రహం

Gujarat High Court: అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం ఫలితం ఓ ఖైదీకు తీరని శాపమైంది. కోర్టు బెయిల్ మంజూరు చేసినా..అధికారులు చూడకపోవడం వల్ల మూడేండ్లు ఆ ఖైదీ జైళ్లోనే మగ్గిపోయాడు. విషయం తెలిశాక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

గుజరాత్‌కు చెందిన ఓ హత్య కేసు ఘటన ఇది. ఈ కేసులో 27 ఏళ్ల చందన్ జీ ఠాకూర్ జీవిత శిక్ష అనుభవిస్తున్నాడు. సెప్టెంబర్ 29వ తేదీ 2020లో గుజరాత్ హైకోర్టు శిక్షను నిలిపివేసి, బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్ కాపీని హైకోర్టు జైలు అధికారులకు ఈ మెయిల్ చేసింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా జైలు అధికారులు బెయిల్ ఆర్డర్‌కు సంబంధించిన మెయిల్ అటాచ్‌మెంట్ ఓపెన్ చేయలేదు. దాంతో ఇప్పటి వరకూ అంటే మూడేళ్లుగా ఆ వ్యక్తి జైళ్లోనే ఉండిపోయాడు. బెయిల్ కోసం ఆ వ్యక్తి తిరిగి హైకోర్టును ఆశ్రయించడంతో అధికారుల నిర్వాకం కాస్తా బయటపడింది. 

బెయిల్ మంజూరైనా సరే చందన్ జీ ఠాకూర్ మూడేండ్లు అదనంగా జైళ్లో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యమే ఇందుకు కారణమని గుజరాత్ హైకోర్టు మండిపడింది. జరిగిన తప్పుకు పరిహారంగా చందన్ జీ ఠాకూర్‌కు 14 రోజుల్లో లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జైలు అధికారులు నిర్లక్ష్యం వహించకపోయుంటే ఆ వ్యక్తి విడుదలై ముడేళ్లుగా స్వేచ్ఛ అనుభవించి ఉండేవాడని. కానీ జైలు అధికారులు హైకోర్టు రిజిస్ట్రీని లేదా సెషన్స్ కోర్టును సంప్రదించే ప్రయత్నం చేయకపోవడం, మెయిల్ ఓపెన్ చేయకపోవడం వల్ల ఆ వ్యక్తి స్వేచ్ఛకు దూరమయ్యాడని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది.

Also read: Chandrababu Case: ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసుల వివరాలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News