Gujarat Hooch Tragedy: గుజరాత్‌లో ఘోర విషాదం.. కల్తీ మద్యం తాగి 18 మంది మృతి

Gujarat Hooch Tragedy Deaths: గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి పలువురు మృత్యువాతపడ్డారు. మృతుల సంఖ్య  ఇప్పటికే 18కి చేరగా.. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 26, 2022, 09:39 AM IST
  • గుజరాత్ కల్తీ మద్యం కలకలం
  • కల్తీ మద్యం తాగి 18 మంది మృతి
  • రోజిద్ గ్రామంలో కల్తీ మద్యం సేవించిన పలువురు కూలీలు
Gujarat Hooch Tragedy: గుజరాత్‌లో ఘోర విషాదం.. కల్తీ మద్యం తాగి 18 మంది మృతి

Gujarat Hooch Tragedy Deaths: మద్య నిషేధం అమలవుతున్న గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం తీవ్ర కలకలం రేపుతోంది. బోతాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి 18 మంది మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కల్తీ మద్యానికి కారకులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ప్రస్తుతం బోతాడ్, భావనగర్, అహ్మదాబాద్‌లలోని వేర్వేరు ఆసుపత్రుల్లో దాదాపు 20 మంది కల్తీ మద్యం బాధితులు చికిత్స పొందుతున్నారు. రోజిద్ గ్రామానికి చెందిన కొందరు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో కల్తీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో ఇద్దరు ఆసుపత్రిలో చేరిన కాసేపటికే మృతి చెందగా.. మరికొందరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఎక్కువమంది దినసరి కూలీలే ఉన్నారు.

బాధితుల్లో ఒకరి భార్య ఈ ఘటనపై మాట్లాడుతూ... ఆదివారం రాత్రి తన భర్త మద్యం సేవించాడని, ఆ తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పేర్కొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు మాట్లాడుతూ.. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి వద్ద తాము మద్యం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ ఘటనపై సిట్‌తో విచారణ జరిపిస్తున్నట్లు భావనగర్ ఐజీ అశోక్ కుమార్ యాదవ్ వెల్లడించారు.

గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కల్తీ మద్యం చావులపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ అండదండలు ఉండటం వల్లే మద్య నిషేధం ఉన్న రాష్ట్రంలోనూ లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన

Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!
 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News