Haryana Government: హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాసం, రేపు అసెంబ్లీలో బలపరీక్ష

Haryana Government: హర్యానా బీజేపీ ప్రభుత్వానికి రేపు విషమ పరీక్ష ఎదురుకానుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. రేపు అసెంబ్లీలో అధికార పార్టీ విశ్వాసం నిరూపించుకోవల్సి ఉంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2021, 10:49 PM IST
Haryana Government: హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాసం, రేపు అసెంబ్లీలో బలపరీక్ష

Haryana Government: హర్యానా బీజేపీ ప్రభుత్వానికి రేపు విషమ పరీక్ష ఎదురుకానుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. రేపు అసెంబ్లీలో అధికార పార్టీ విశ్వాసం నిరూపించుకోవల్సి ఉంది.

హర్యానాలో ప్రస్తుతం బీజేపీ కూటమి ప్రభుత్వం( Bjp government) అధికారంలో ఉంది. జననాయక్ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ రేపు అసెంబ్లీలో అవిశ్వాసం ఎదుర్కోనుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం(No confidence motion) ప్రవేశపెట్టడంతో రేపు అసెంబ్లీలో ఓటింగ్ జరగనుంది. మొత్తం 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీ(Haryana Assembly)లో బీజేపీకు 40 మంది ఎమ్మెల్యేలుండగా..మిత్రపక్షం జేజేపీకు పది మంది సభ్యులున్నారు. అవిశ్వాసం నుంచి గట్టెక్కాలంటే బీజేపీ ప్రభుత్వానికి 45 మంది సభ్యుల మద్దతు అవసరముంది. సంఖ్యాపరంగా బీజేపీ కూటమి ప్రభుత్వానికి డోకా లేదని తెలుస్తున్నా..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన నేపధ్యంలో పరిణామాలు మారే అవకాశాలున్నాయనేది నిఘా వర్గాల సమాచారం. అందుకే బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమై..సభ్యుల్ని రక్షించుకునే పనిలో పడింది. కూటమిలోని బీజేపీ, జేజేపీ రెండు పార్టీలు తమ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని ఇప్పటికే జేజేపీ ఆదేశాలు జారీ చేసింది. 

అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ(Congress party)కు 30 మంది సభ్యులు, ఇతరులు 8 మంది ఉన్నారు. కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా అసెంబ్లీకు హాజరుకావాలని విప్ జారీ చేసింది. రైతు ఆందోళనలో హర్యానా నుంచి కూడా పెద్దఎత్తున రైతులు ఉద్యమంలో పాలుపంచుకుంటున్న నేపధ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 

Also read: Tamilnadu Elections 2021: టీటీవీ దినకరన్‌తో పొత్తు, మూడు స్థానాల్లో బరిలో దిగనున్న ఎంఐఎం పార్టీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News