Bhole baba First reaction on Hathras stampede: హత్రాస్ లో ఇటీవల జరిగిన తొక్కిసలాట వల్ల దేశ వ్యాప్తంగా భోలేబాబా పేరు మార్మోగిపోయింది. ఈ ఘటనలో దాదాపు 121 మంది అమాయకులకు బలయ్యారు. హత్రాస్ లో భోలేబాబా సత్సంగ్ కోసం భక్తులు పొటేత్తారు. కానీ అక్కడి సిబ్బంది సరైన ఏర్పాట్లు చేయక పోవడం వల్ల దారుణం జరిగింది. ముఖ్యంగా భోలేబాబా పాదధూళీ లేదా ఆయన నడిచిన నెలలోని మట్టికి అనేక శక్తులున్నాయని అక్కడి ప్రజలు నమ్ముంతుంటారు. ఆ మట్టి మన ఇంట్లో ఉంటే నెగెటివ్ ఎనర్జీ అంతా దూరమైపోతుందంట. అంతేకాకుండా.. అన్ని విధాలుగా కలసి వస్తుందని ప్రజలు విశ్వసిస్తుంటారు. దీనిలో భాగంగా భోలేబాబా కారులో ఉండగా.. ఆయన వద్దకు చేరుకొవడానికి ప్రజలు పోటీ పడ్డారు.
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
ఇంతలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలు ఊపిరాడక విగత జీవులుగా మారిపోయారు.ఈ ఘటన జరిగినప్పటి నుంచి భోలేబాబా పూర్తిగా కన్పించకుండా పోయారు. ఆయన తరపు లాయర్ మాత్రం.. ఇటీవల భోలేబాబా విచారణకు సహకరిస్తారని కూడా పోలీసులకు తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో తమ వాళ్లను కొల్పోయిన కూడా కొందరు భక్తులు భోలేబాబా దేవుడి స్వరూపం అని ఆయనను కొందరు కావాలని చెడ్డపేరు వచ్చేలా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
భోలేబాబాకు వందల కోట్ల ఆస్తులు, లగ్జరీ ఆశ్రమాలు, మూడెంచల భద్రత విషయాలను తెలుసుకుని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, భోలేబాబా తొలిసారి మీడియా ముందుకు వచ్చి ఘటనపై స్పందిచారు. భోలేబాబా మాట్లాడుతూ.... సత్సంగ్ లో చనిపోయిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు తమ ట్రస్ట్ తరపున విద్యా, ఆరోగ్యం, పెళ్లి మొదలైన వాటిని సహాకారం అందిస్తామని కూడా భోలాబాబా ప్రకటించారు.
Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
ఈ క్లిష్టపరిస్థితుల్లో దేవుడు ప్రజలకు.. బాధను భరించే శక్తిని వారికి ఇవ్వాలని అన్నారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. తనకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసముందన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ముఖ్య సేవాదార్ గా పిలవబడే.. దేవ్ ప్రకాశ్ మధుకర్ అనే వ్యక్తి శుక్రవారం పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. అతను ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hathras stampede: భోలే బాబా సంచలనం.. చనిపోయిన కుటుంబాలకు ఆ సహాయం చేస్తామంటూ వ్యాఖ్యలు..
హత్రాస్ ఘటన పట్ల దిగ్బ్రాంతికి గురయ్యానన్న భోలేబాబా..
పోలీసులపై నమ్మకముందంటూ వ్యాఖ్యలు..