HD Deve Gowda: మాజీ ప్రధాన మంత్రి ప్రస్తుత జేడీఎస్ తరుపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న దేవెగౌడ తాజాగా రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. తాజాగా పార్లమెంట్ వేదికగా రాజ్యసభలో ఆయన రిజర్వేషన్ల తుట్టెను కదిపారు. కులం ఆధారంగానే రిజర్వేషన్లు కొనసాగించాలా ? లేక ఆర్థిక స్థితిపై రిజర్వేషన్లు కల్పించాలా అన్న విషయంపై పార్లమెంట్ పునరాలోచించాలన్నారు.
గతంలో ఇచ్చిన రిజర్వేషన్లు ప్రజల స్థితిని మార్చలేకపోయాయంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. మన దేశంలో చాలా మంది ఇప్పటికీ రెండు పూటలా భోజనానికి తిప్పలు పడుతున్నారని దేవెగౌడ గుర్తు చేశారు. అందుకే రిజర్వేషన్లపై పునారాలోచన చేయాలన్నారు.
దేవె గౌడ విషయానికొస్తే.. ఆయన 1996 జూన్ 1 నుంచి 21 ఏప్రిల్ 1997 వరకు కేవలం 324 రోజులు మాత్రమే దేశ ప్రధాన మంత్రిగా సేవలు అందించారు. వాజ్ పేయ్ గవర్నమెంట్ 13 రోజుల్లో కుప్ప కూలిని తర్వాత అప్పట్లో చంద్రబాబు నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ తరుపున ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. తక్కువ రోజులు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా నిలిచారు. అంతకు ముందు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం కేంద్రంలో మూడోసారి కేంద్రంలో కొలువు దీరిన ఎన్డీయే ప్రభుత్వం ఆయన నేతృత్వం వహిస్తున్న జేడీఎస్ కీలకంగా మారింది. ఆయన కుమారుడు కుమార స్వామి కేంద్ర ప్రభుత్వంలో క్యాబినేట్ మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండు సార్లు సేవలు అందించారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.