తెలంగాణ: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కోఠి, అబిడ్స్, నాంపల్లి, హిమయత్‌నగర్, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
ఉదయం వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసులకెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇలా ఉండగా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ఆదేశాలు జారీ చేశారు. ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యు బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నిలిచి ఉన్న నీటిని బయటకు పంపిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాల మోత..!