IIT : ఒక మంచి ఐఐటి కాలేజీలో సీట్ తెచ్చుకొని చదువుకోవాలి అని అనుకుని కలలు కనే విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఐఐటి లో సీట్ సంపాదించడం అంటే అందరికీ వీలు పడే పని కాదు. ఐఐటీ లో అడ్మిషన్ దొరకటం చాలా కష్టం అని నమ్మే వారి సంఖ్య ఎక్కువ. ఐఐటీ లో చేరాలి అనుకోగానే ముందుగా గుర్తొచ్చేది కాలేజీ యొక్క ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేదా గేట్ స్కోర్.
కానీ ఎలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయకుండా, అసలు గేట్ స్కోర్ తో పనే లేకుండా కూడా ఐఐటీలో సీటు దొరికే అవకాశం ఉంది అని మీకు తెలుసా? అన్నీ కోర్సులకి కాకపోయినా ఐఐటి కాన్పూర్ లో ఒక కోర్స్ లో మాత్రం ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేదా గేట్ స్కోర్ లేకుండానే అడ్మిషన్ అందుకోవచ్చు ఇంతకీ ఆ కోర్స్ ఏంటి? దాని వివరాలు గురించి తెలుసుకుందాం..
ఐఐటి కాన్పూర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్) వారు ఈ మధ్యనే ఒక కొత్త ఆన్లైన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రోగ్రాం ను ప్రారంభించారు. కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసులు బాగానే పెరిగిపోయాయి. డిజిటల్ యుగానికి ఏమాత్రం తీసిపోకుండా అందరూ ఆన్లైన్ లో కోర్సులు మొదలు పెట్టేసారు. ఐఐటి కాన్పూర్ వారు కూడా నాయకత్వ నైపుణ్యాలతో బిజినెస్ లీడర్షిప్ సంపాదించడానికి ఒక డిజిటల్ కోర్స్ ని ప్రారంభించింది.
ఐఐటి కాన్పూర్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సైన్సెస్ వారు ఈ కోర్సుని మొదలుపెట్టారు. ఆధునిక ట్రేడ్ డైనమిక్ పై అవగాహన అందించేందుకు ఈ కోర్స్ దోహదపడుతుంది. కానీ ఈ కోర్స్ లో అడ్మిషన్ కోసం ఎలాంటి గేట్ స్కోర్ తో పనిలేదు. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం. ఐఐటి కాన్పూర్ లోని నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఈ కోర్సు అందిస్తున్నారు. ప్రత్యక్ష ఇంటరాక్టివ్ తరగతులు వారాంతాల్లో మాత్రమే ఉండేలాగా ఈ కోర్స్ ఉంటుంది.
ఫాస్ట్ లర్నింగ్ తో ఈ కోర్స్ ని ఒకటి నుంచి మూడు సంవత్సరాల లోపు పూర్తి చేయొచ్చు. ఈ ప్రోగ్రాం 60 క్రెడిట్ స్ట్రక్చర్ ను కలిగి ఉంటుంది. ఇందులో మూడు కోర్ మోడ్యూల్స్, పది టెక్నాలజీ ఓరియెంటెడ్ మోడల్స్ తో పాటు క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఇందులో పాల్గొనేవారు ప్లేస్మెంట్ సెల్ ఇంక్యుబేషన్ సెల్ యొక్క ఆక్సిస్ కూడా పొందుతారు. దీని వల్ల వారి భవిష్యత్తు లో వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.
Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు
Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook