Amit Shah Tests Corona Negative న్యూఢిల్లీ: భారత్ (India) లో చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పలు పార్టీల నేతలు కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి బారిన పడ్డారు. హోంమంత్రి అమిత్ షా ( Amit Shah) సైతం రెండు వారాల క్రితం ( ఆగస్టు 2న ) కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు శుక్రవారం COVID-19 పరీక్షలు చేయగా.. కరోనా నెగిటివ్ వచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా తెలిపారు. దాదాపు రెండు వారాల తరువాత హోంమంత్రి స్వయంగా తన కరోనా పరీక్ష ఫలితాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. Also read: Kozhikode plane Crash: 22మంది అధికారులకు కరోనా.. స్వాతంత్ర్య వేడుకలకు సీఎం దూరం
आज मेरी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव आई है।
मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ।
डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।— Amit Shah (@AmitShah) August 14, 2020
‘‘ఈ రోజు నా కరోనా పరీక్ష రిపోర్ట్ నెగిటివ్‌గా వచ్చింది. దేవునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సమయంలో నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు ఇంట్లో క్వారంటైన్ ఉండనున్నాను’’ అని ఆయన ట్విట్ చేసి వెల్లడించారు.
ఇదిలాఉంటే అంతకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆగస్టు 9న కరోనా నెగిటివ్ వచ్చినట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెంటనే వివరణ ఇచ్చింది. ఇప్పటివరకు అమిత్ షాకు కోవిడ్-19 పరీక్షలు చేయలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రోజు అమిత్ షానే తన రిపోర్టు నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. Also read: Independence Day: పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన హోంశాఖ