Kozhikode plane Crash: 22మంది అధికారులకు కరోనా.. స్వాతంత్ర్య వేడుకలకు సీఎం దూరం

కేర‌ళ‌లోని కోజికోడ్ ( Kozhikode ) విమానాశ్ర‌యంలో గ‌త వారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూలి ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్ర‌యాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం రెండుముక్క‌లైంది. ఈ విమాన ప్ర‌మాదం త‌రువాత సహాయక చర్యల్లో అనేక మంది అధికారులతోపాటు స్థానికులు సైతం పాల్గొన్నారు.

Last Updated : Aug 14, 2020, 05:27 PM IST
Kozhikode plane Crash: 22మంది అధికారులకు కరోనా.. స్వాతంత్ర్య వేడుకలకు సీఎం దూరం

Officers tested Covid-19 Positive: కోజికోడ్‌: కేర‌ళ‌లోని కోజికోడ్ ( Kozhikode ) విమానాశ్ర‌యంలో గ‌త వారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూలి ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్ర‌యాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం రెండుముక్క‌లైంది. ఈ విమాన ప్ర‌మాదం త‌రువాత సహాయక చర్యల్లో అనేక మంది అధికారులతోపాటు స్థానికులు సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లాలని ప్రభుత్వం కూడా సూచించింది. పాల్గొన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయగా.. వారిలో 22 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా నిర్థారించారు. వారిలో జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు స్థానిక పోలీసు అధికారి కూడా ఉన్న‌ట్లు మాల‌ప్పురం మెడిక‌ల్ ఆఫీస‌ర్ శుక్రవారం తెలిపారు. 

ఇదిలాఉంటే.. కోజికోడ్ విమాన ప్రమాద సంఘటన స్థలాన్ని సందర్శించిన కేరళ ముఖ్యమంత్రి విజయన్ (Pinarayi Vijayan), ఇతర మంత్రులు కూడా క్వారంటైన్‌లోకి వెళ్లారు. దీంతో రేపు తిరువనంతపురంలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో సహకార, టూరిజం శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ( Kadakampally Surendran ) జాతీయ జెండాను ఎగరవేయనున్నట్లు కేరళ సీఎంవో ప్రకటించింది.

వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా 184 మంది ప్ర‌యాణికుల‌తో దుబాయ్ నుంచి భారత్ వ‌చ్చిన ఎయిర్ ఇండియా విమానం క‌రిపుర్ విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ స‌మ‌యంలో కుప్ప కూలి రెండు ముక్కలైంది. రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొని క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలిన వారందరి గురించి స్పష్టమైన సమాచారం ఇంకా ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే ఈ ప్రమాద ఘటనపై కేరళ ప్రభుత్వం 30 మంది కేరళ పోలీసులతో ప్రత్యేక బృందంతో సిట్ ఏర్పాటు చేసింది. దీంతోపాటు ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB ) కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. 

Trending News