huge young women participate in police recruitment Drive in jammu kashmir : ఒక్క ఛాన్స్ ఇవ్వండి..మేమేంటో నిరూపిస్తాం..

జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారమే .. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి స్థానిక యువత నుంచి భారీగా స్పందన వచ్చింది.

Last Updated : Jan 21, 2020, 05:12 PM IST
huge young women participate in police recruitment Drive in jammu kashmir : ఒక్క ఛాన్స్ ఇవ్వండి..మేమేంటో నిరూపిస్తాం..

జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారమే .. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి స్థానిక యువత నుంచి భారీగా స్పందన వచ్చింది. ముఖ్యంగా యువతులు కూడా తాము సైతం అన్నట్టు పోలీస్ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో క్యూ కట్టారు.  జమ్మూ కాశ్మీర్ బెటాలియన్‌లో చేరి శాంతి భద్రతలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం నిర్వహించిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పెద్ద ఎత్తున యువతులు రావడమే ఇందుకు ఉదాహరణ. చలిగాలులు వీస్తున్నా.. వర్షం కురుస్తున్నా.. మొక్కవోని పట్టుదలతో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. తాము సైతం జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి, దేశానికి సేవ చేస్తామని ధైర్యంగా ముందుకొచ్చారు. 

నిరంతరం ఉగ్రవాదుల చొరబాట్లతో ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగం చేయడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటిది.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని తాము విధులు నిర్వహిస్తామనే ధైర్యంతో వారంతా ముందుకు వచ్చారని రిక్రూట్ మెంట్ బోర్డ్ ఛైర్మన్ ధనిష్ రాణా తెలిపారు. వారిలో మంచి ఉత్సాహం ఉందంటూ కితాబిచ్చారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News