కరోనా వైరస్ ( Corona virus ) విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అది కూడా భారతదేశంలో. మీకు నాకూ...ఎవరికీ తెలియకుండా కరోనా ఏకంగా 20 కోట్ల మందికి వచ్చిపోయిందట.
నమ్మలేకపోతున్నారా..నిజమే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( Indian council of medical research ) ( ICMR ) చేసిన సర్వేలో వెల్లడైన విషయాలివి మరి. నమ్మాల్సిందే కదా. అధికారిక లెక్కల ప్రకారం..అంటే అధికారికంగా చేయించుకున్న పరీక్షల ప్రకారం ఇండియాలో ఇప్పటివరకూ 61 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. మరి ఐసీఎంఆర్ ( ICMR ) చెబుతున్నదాని ప్రకారం ఆగస్టు నాటికి దేశంలో ఏకంగా 20 కోట్లమందికి వైరస్ ( 20 crores affected by coronavirus ) వచ్చి పోయిందని తేలింది.
దేశంలో 15.9 కోట్ల నుంచి 19.6 కోట్ల మందికి కరోనా వైరస్ సోకిందని..పదేళ్ల కంటే ఎక్కువ వయస్సున్నవారిలో ప్రతి 15 మందిలో ఒకరికి కచ్చితంగా కరోనా వైరస్ సోకిందని ఐసీఎంఆర్ అధ్యయనంలో తెలిసింది. పట్టణాల్లోని మురికివాడల్లో 15.6 శాతం మందికి వైరస్ వచ్చి పోయిందని..నగరంలోని కాలనీల్లో అయితే కనీసం 8.2 శాతం మంది కరోనా బారిన పడినట్టు ఐసీఎంఆర్ తాజా అధ్యయన గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనీసం 4.4 శాతం మందికి కరోనా వైరస్ రావడం, తగ్గిపోవడం జరిగిందని చెబుతోంది. కరోనా వైరస్ సంక్రమణ అనేది లింగబేధం లేకుండా వ్యాపిస్తోందని...రానున్న శీతాకాలంలో మరింతగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరిస్తోంది. Also read: Serum institute: పదికోట్ల అదనపు డోసులు, రాయితీ ధర నిర్ణయం