మోడీ మళ్లీ వస్తే...ఇక ఎన్నికలు రావు - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు

                  

Updated: Mar 19, 2019, 09:54 PM IST
మోడీ మళ్లీ  వస్తే...ఇక ఎన్నికలు రావు - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుధ్దం ఊపందుకుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఓ ప్రెస్ మీట్ లో గెహ్లాట్ మాట్లాడుతూ ప్రధాని మోడీ మరోసారి ప్రధాని అయితే భారత్ లో మళ్లీ ఎన్నికలు జరగడం కష్టమన్నారు. ఇదే జరిగితే భారత్ కూడా చైనా, రష్యా బాటలో  పయనిస్తుందని జోస్యం చెప్పారు. 

ప్రమాదంలో ప్రజాస్వామ్యం..
మళ్లీ మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే దేశం మరియు ప్రజాస్వామ్యం రెండూ  ప్రమాదకర పరిస్థితిలోకి జారుకుంటాయని దయ్యబట్టారు. మోడీ అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరని విమర్శించారు.  ప్రధాని కావడం కోసం పాకిస్థాన్ తో యుద్ధానికి కూడా మోదీ సిద్ధమని..ఈ  మాట ప్రజల నోటే వినిపిస్తుందని దయ్యబట్టారు

ఆ విషయంలో మోడీ మించిన వారు లేరు
సినిమా  నటుల కంటే మోదీ బాగా నటిస్తారని ఎద్దేవ చేశారు. ఈ విషయంలో మోడీని మించిన వారు లేరని విమర్శించారు. గత ఎన్నికల్లో తప్పుడు ఇచ్చి అధికారంలోకి వచ్చారని.. మళ్లీ ఇదే తరహా పంథాను అనుసరించాలనుకుంటున్నారు విమర్శించారు. తప్పుడు హామీలను ఇవ్వడంలో మోదీ సిద్ధహస్తుడని గెహ్లాట్ విమర్శించారు. మోడీ ఎన్నికుట్రలు పన్నిన అసత్యానికి, సత్యానికి ఉన్న తేడా ప్రజలకు తెలుసుని అంతియంగా సత్యమే గెలుస్తుందని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు