"మన్ కీ బాత్" విశేషాలు

    

Last Updated : Oct 29, 2017, 02:50 PM IST
"మన్ కీ బాత్" విశేషాలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం "మన్ కీ బాత్" పేరుతో జరిగిన రేడియో షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజసమితి శాంతిభద్రతా దళాలతో భారత్ అనుబంధం, క్రీడల ప్రాముఖ్యతతో పాటు స్వచ్ఛభారత్ ప్రాధాన్యం గురించి కూడా వివరించారు. ఈ రేడియో షోలో మోడీ ప్రస్తావించిన పలు ముఖ్యమైన విషయాలు ఇవే

  • ప్రధానిగా నేను దీపావళి నాడు వెళ్లి భారత సైనికులకు కలవడం ప్రజల్లో ఎంత చైతన్యం తీసుకువచ్చిందంటే, వారి నుండి నరేంద్ర మోడీ యాప్‌కు పదే పదే సందేశాలు రావడం ప్రారంభమయ్యాయి. దేశసేవ చేస్తున్న సైనికులకు తాము కూడా స్వీట్ బాక్సులు పంపామని ఎందరో పోస్టు చేశారు.
  • మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికి నుండీ మనం ఖాదీ దుస్తులను కేవలం ఫ్యాషన్‌గానే చూసేవాళ్లం. కానీ నేడు ఖాదీ ఒక మార్పుకు సంకేతంగా నిలిచింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే.. ఈ సంవత్సరం దాదాపు 90 శాతం ఖాదీ వస్త్రాలు అమ్ముడయ్యాయి. 
  • ఐక్యరాజసమితి శాంతిభద్రతా దళాలతో మన సైనికులు కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభూతి. ఈ సంవత్సరం ఎందరో మహిళా సైనికులు కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు
  • దాదాపు 10 సంవత్సరాల తర్వాత భారతదేశం ఆసియా కప్ గెలుచుకుంది. నేను మొత్తం జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 
  • ఫిఫా అండర్ 17 ప్రపంచ కప్‌లో మన కుర్రాళ్లు వారి శక్తిమేరకు రాణించారు. ఫుట్‌బాల్ రంగంలో భారత్ తన భవిష్యత్తును వీరిలో చూసుకోవాలని ఆశిస్తోంది
  • "ఎకలాజికల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్" అనే ఎన్జీఓ వాలంటీర్లు చంద్రపూర్ కోటను శుభ్రపరిచే బాధ్యతను చేపట్టారు. ఒక జట్టుగా మారి 200 రోజులు అవిశ్రాంతంగా కష్టపడి ఆ కోట మొత్తాన్ని శుభ్రపరిచారు. వారు నాకు పంపించిన ఫోటోలను చూసి, స్వచ్ఛభారత్ పట్ల వారి అక్కరను చూసి ఆశ్చర్యచకితుడినయ్యాను. 
  • యోగా ఫర్ ఇండియా కార్యక్రమం నిజంగానే దిగ్విజయమైంది. మీ పిల్లల జీవనశైలి మారడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది

Trending News