ITR Refund: ఐటీఆర్ రిఫండ్ ఆలస్యమైతే ఏం చేయాలి, ఈ కారణాలు కావచ్చు

ITR Refund Delay: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ గడువు తేదీ ముగిసింది. ఇప్పుడిక కేవలం జరిమానాతో మాత్రమే ఐటీ రిటర్న్స్ పైల్ చేసేందుకు సమయముంది. ఇప్పటికే రిటర్న్స దాఖలు చేసినవాళ్లు రిఫండ్ కోసం నిరీక్షిస్తుంటే మీ కోసం కీలకమైన అప్‌డేట్ ఇది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 13, 2024, 06:47 PM IST
ITR Refund: ఐటీఆర్ రిఫండ్ ఆలస్యమైతే ఏం చేయాలి, ఈ కారణాలు కావచ్చు

ITR Refund Delay: మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా. ఇంకా రిఫండ్ రాలేదని వెయిట్ చేస్తున్నారా అయితే ఈ అప్‌డేట్స్ కచ్చితంగా మీకే. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తరువాత ఇ వెరిఫై అయిందో లేదే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇ వెరిఫై పూర్తయిన తరువాతే రిఫండ్ ప్రక్రియ మొదలవుతుంది. మీ రిఫండ్ ఎందుకు ఆలస్యమౌతుందో పరిశీలిద్దాం.

దేశవ్యాప్తంగా చాలామంది ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసేశారు. కొంతమందికి ఇప్పటికే రిఫండ్ అందగా మరి కొంతమంది రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిఫండ్ అందడంలో ఆలస్యం జరుగుతుంటే ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. సాధారణంగా చాలామంది రిటర్న్స్ ఫైల్ చేసి వదిలేస్తుంటారు. ఇ వెరిఫికేషన్ పూర్తి చేయరు. ఇ వెరిఫై పూర్తి కానంతవరకు రిటర్న్స్ ప్రక్రియ పూర్తి కానట్టే లెక్క. అంటే ఇ వెరిఫికేషన్ పూర్తయితేనే రిఫండ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. సాధారణంగా ఇ వెరిఫికేషన్ పూర్తయిన 4-5 వారాలకు రిఫండ్ ట్యాక్స్ పేయర్ బ్యాంక్ ఎక్కౌంట్‌లో జమ అవుతుంది. నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ట్యాక్స్ కట్ అయినవాళ్లకే రిఫండ్ జమ అవుతుంది. ఇందులో టీడీఎస్, టీసీఎస్ కలిపి ఉంటాయి. అంటే ట్యాక్స్ పేయర్ అడ్వాన్స్‌గా చెల్లించిన ట్యాక్స్ నుంచి నిర్ణీత మొత్తం ట్యాక్స్ మినహాయించి మిగిలింది రిఫండ్ చేస్తారు. 

ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాక రిఫండ్ అందడంలో ఆలస్యం జరిగిందంటే దానికి చాలా కారణాలుంటాయి. ఇందులో ప్రధానమైన కారణం అంటే బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు సరిగ్గా లేకపోవడం లేదా బ్యాంక్ ఎక్కౌంట్ వెరిఫై కాకపోవడం, ఐటీ రిటర్న్స్ వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడం వంటివి ఉంటాయి. 

రిఫండ్ ఎప్పుడు రెస్ట్రిక్ట్ అవుతుంది

ఒక్కోసారి రిఫండ్ రెస్ట్రిక్ట్ అవుతుంటుంది. అంటే మీ బ్యాంక్ ఎక్కౌంట్‌లో ఉన్న పేరుతో పాన్ కార్డులో పేరు మ్యాచ్ కాకపోతే ఇలా జరుగుతుంది. మీక్కూడా ఈ సమస్య ఎదురైతే రెండింట్లో ఒకేలా ఉండేట్టు చూసుకోండి. పాన్‌కార్డులో, బ్యాంకులో మీ వివరాలు సరిగ్గా అప్‌డేట్ చేసుకోవాలి. 

రిఫండ్ ఆలస్యమైతే ఏం చేయాలి

రిఫండ్ ఆలస్యమైతే ఏం చేయాలనేది చాలామందికి తెలియదు. ముందుగా మీ మెయిల్ చెక్ చేసుకోవాలి. ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి రిఫండ్‌కు సంబంధించి ఏదైనా నోటీసు లేదా మెయిల్ వచ్చిందో లేదో చూసుకోండి. రిఫండ్ క్లెయిమ్ రిజెక్ట్ అయితే రిఫండ్ కోసం రీ ఇష్యూయెన్స్ చేయవచ్చు. క్లెయిమ్ పెండింగులో ఉన్నట్టు చూపిస్తే ఈ పైలింగ్ పోర్టల్ సంప్రదించాలి. 

లేదా ఇన్‌కంటాక్స్ శాఖ హెల్ప్‌లైన్ నెంబర్ 1800 103 4455 కు కాల్ చేసి లేదా ask@incometax.gov.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ రిఫండ్ స్టేటస్ గురించి తెలుస్తుంది. లేదా నేరుగా సమీపంలోని ఇన్‌కంటాక్స్ శాఖ కార్యాలయానికి సంప్రదించవచ్చు. 

Also read: Bank Holidays in August 2024: వచ్చే 15 రోజుల్లో 6 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News