India Corona Update: దేశంలో ఇటీవల క్రమంగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఇవాళ (బుధవారం) ఉదయం వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 1,088 మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. మొత్తం 4,29,323 టెస్టులకు గానూ ఈ కేసులు నమోదైనట్లు వివరించింది.
ఇక సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 796 కేసు మాత్రమే నమోదవడం గమనార్హం.
ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.35 శాతంగా, వారంవారీ పాజిటివిటీ రేటు 0.24 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ డేటాలో వెల్లడైంది.
తాజా గణాంకాలు దేశంలో జూన్-జులై మధ్య కరోనా థార్డ్ వేవ్ రావచ్చన్న అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే చైనా సహా వివిధ దేశాల్లో కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న విషయం తెలిసిందే.
#Unite2FightCorona#LargestVaccineDrive
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/AJJExQ8WoR pic.twitter.com/9XAGnRnjOj
— Ministry of Health (@MoHFW_INDIA) April 13, 2022
దేశంలో ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా..
ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది ఆరోగ్య శాఖ. దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,21,736 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీనితో దేశంలో కొవిడ్ మరణాల రేటు 1.21 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం మధ్య 1,081 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 42,505,410 మంది కరోనా మహమ్మారిని జయించారు. దేశంలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.
దేశంలో యాక్టివ్ కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా ఇంకా 10,870 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల రేటు 0.03 శాతంగా ఉంది.
దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ ఇలా..
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,05,332 డోసుల కరోనా టీకాలు పంపిణీ చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,07,06,499 వద్దకు చేరింది.
Also read: Corona Fourth Wave: కోవిడ్ ఫోర్త్‌వేవ్ ఇండియాలో జూన్-జూలై నెలల్లో ఖాయమేనా
Also read: Nitish kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ సభకు సమీపంలో బాంబు దాడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook