Covid 19 Cases Updates: అదుపులోనే కరోనా వ్యాప్తి.. తగ్గిన కొత్త కేసులు... యాక్టివ్ కేసుల్లోనూ తగ్గుదల..

Covid 19 Cases Updates: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 5 వేలు మాత్రమే నమోదయ్యాయి.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 11, 2022, 10:08 AM IST
  • కోవిడ్ 19 కేసుల అప్‌డేట్స్
  • 5 వేల మార్క్‌కి పడిపోయిన కొత్త కేసులు
  • గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలివే
Covid 19 Cases Updates: అదుపులోనే కరోనా వ్యాప్తి.. తగ్గిన కొత్త కేసులు... యాక్టివ్ కేసుల్లోనూ తగ్గుదల..

Covid 19 Cases Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య 5వేల మార్క్‌కి పడిపోయింది. గత 2 రెండు రోజుల్లో 6093, 5554 కొత్త కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య 5076కి పడిపోయింది. కరోనాతో మరో 11 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,495,359కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 5,28,150కి చేరింది. మొత్తం కేసుల్లో మరణాల శాతం 1.19శాతంగా ఉంది.

కొద్దిరోజులుగా 10 వేల మార్క్‌కి దిగువనే నమోదవుతున్న కేసులు గడిచిన 2 రోజులుగా 5 వేల మార్క్‌కి పడిపోయాయి. నిన్నటితో (సెప్టెంబర్ 10) పోలిస్తే 478 కేసులు ఇవాళ తక్కువగా నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 48,850 యాక్టివ్ కేసులు ఉండగా ఇవాళ ఆ సంఖ్య 47,945కి పడిపోయింది. మొత్తం కరోనా కేసుల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 0.11 శాతంగా ఉంది.

ప్రస్తుతం జాతీయ స్థాయిలో కోవిడ్ రికవరీ రేటు 98.70 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 5970 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన కోవిడ్ రికవరీల సంఖ్య 43,919,264కి చేరింది. మొత్తంగా గడిచిన 7 రోజుల్లో దేశంలో 38,824 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న యాక్టివ్ కేసుల్లో అత్యధికంగా కేరళలో (10321), మహారాష్ట్రలో (6578), తమిళనాడులో (4896), కర్ణాటకలో (4379) కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 2,149,536,744 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

Also Read: Krishnam Raju Last Wsh: కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి కాదట.. ఏమిటో తెలుసా?

Also Read: ఆ కారణంతోనే కృష్ణంరాజు మృతి.. కొంప ముంచిన కరోనా.. అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News