JN.1 Cases in India: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ముఖ్యంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో జేఎన్. 1 వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశంలో న్యూ వేరియంట్ కేసులు 682కు ఎగబాకాయి. మెుత్తం 12 రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కేరళలో 148, మహారాష్ట్రలో 139, గోవాలో 47, గుజరాత్‌లో 36, ఆంధ్రప్రదేశ్‌లో 30, రాజస్థాన్‌లో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 21, ఒడిశాలో మూడు, తెలంగాణలో రెండు, హర్యానాలో ఒక కేసు నమోదైంది.
మరోవైపు కొత్త వేరియంట్ కారణంగా దేశంలో కొవిడ్ కేసులు సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 605 కరోనా ఇన్ఫెక్షన్స్ నమోదయ్యాయి. వైరస్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇద్దరు, కర్ణాటక, త్రిపురలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. నిన్న మహమ్మారి నుంచి 648 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 44,481,341కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,002 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా జేఎన్.1 కేసులు 41 దేశాల్లో బయటపడ్డాయి. యూఎస్ లో కూడా ఈ వేరియంట్ కేసులు అధికమవుతున్నాయి.
Also read:Ayodhya Flight Fare: అయోధ్యకు విమానయానం మరింత ప్రియం, భారీగా పెరిగిన టికెట్ ధరలు
Also read: CBSE Board Exam: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో మార్పు, కొత్త షెడ్యూల్ ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook