India corona Update: దేశంలో కొవిడ్ విజృంభణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా ఒక్క రోజులో 83,876 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 11,56,363 టెస్టులకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు వెల్లడించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.
యాక్టివ్ కేసులు ఇలా..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 11,08,938 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.43 శాతంగా ఉంది.
మరణాలు ఇలా..
కరోనా కారణంగా తాజాగా 895 మంది మృతి చెందారు. దీనితో దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,02,874 వద్దకు చేరింది. కొవిడ్ మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
రికవరీలు ఇలా..
దేశవ్యాప్తంగా తాజాగా ఒక్క రోజులో 1,99,054 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 42,272,014 మందికి కరోనా సోకగా.. అందులో 40,660,202 మంది మహమ్మారిని జయించారు. దేశంలో రికవరీ రేటు 96.19 శాతంగా ఉంది.
India's daily cases drop below 1 lakh; the country reports 83,876 fresh #COVID19 cases, 1,99,054 recoveries and 895 deaths in the last 24 hours.
Active cases: 11,08,938
Death toll: 5,02,874
Daily positivity rate: 7.25%Total vaccination: 1,69,63,80,755 pic.twitter.com/i2PatSLAxi
— ANI (@ANI) February 7, 2022
వ్యాక్సినేషన్ ఇలా..
దేశవ్యాప్తంగా ఆదివారం 14,70,053 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,69,63,80,755 వద్దకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 395,882,670 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,758,593 మంది మహమ్మారికి బలయ్యారు. 314,743,461 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 75,380,616 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.
Also read: Sputnik Light: సింగిల్ డోసు టీకా స్పుత్నిక్ లైట్ వినియోగానికి భారత్ ఓకే!
Also read: Central employees: సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో 100 శాతం ఉద్యోగులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook