India Covid19 Cases: భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. నిత్యం కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 24 గంటల వ్యవధిలో లక్షన్నర పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా ప్రభావిత దేశాలలో బ్రెజిల్‌ను వెనక్కినెట్టి భారత్ రెండో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్, భారత్ దేశాలలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. కరోనా మరణాలు సైతం ఈ దేశాల్లోనూ అధికంగా సంభవిస్తున్నాయి.
భారత్‌లో తాజాగా 1,68,912 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,27,717కు చేరింది. బ్రెజిల్‌లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,34,82,543గా ఉంది. కరోనా కేసులలో భారత్ రెండో స్థానంలో ఉండగా, కోవిడ్19 మరణాలలో నాల్గో స్థానంలో ఉంది. అత్యధికంగా అమెరికాలో 5,75,829 మంది కరోనా బారిన పడి చనిపోయారు. భారత్‌లో కరోనా మరణాలు 1.70 లక్షలకు చేరగా, బ్రెజిల్‌లో 3,53,293 మంది, మెక్సికోలో 2,09,212 మందిని కరోనా బలిగొంది.
Also Read: COVID-19 Positive Cases: తెలంగాణలో ఫలితాలు ఇస్తున్న Face Masks, కరోనా కేసులు తగ్గుముఖం
గత రెండు వారాల నుంచి భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. వందలోపు నమోదయ్యే కరోనా మరణాలు ప్రస్తుతం వెయ్యికి చేరువలో నమోదవుతున్నాయి. పదిహేను వేల లోపు నమోదయ్యే రోజువారీ కేసుల సంఖ్య ప్రస్తుతం లక్షన్నరకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి 6 కరోనా కేసులలో ఒకటి భారత్‌లో నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో 9 లక్షల పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం కరోనా తీవ్రతకు నిదర్శనం.
గత ఏడాది అత్యధికంగా సెప్టెంబర్ నెలలో ఒకరోజు 97వేలకు పైగా నమోదయ్యాయి. కానీ ఏప్రిల్ 4న తొలిసారిగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక అది మొదలు ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. ప్రస్తుతం లక్షన్నరకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ప్రజలను మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. మరోవైపు కరోనా టీకాల పంపిణీ వేగవంతం చేసేందుకు టీకా ఉత్సవ్ ప్రారంభించారు.
Also Read: Corona Puzzle: కరోనా పజిల్ వదిలిన పుణే పోలీసులు, విషయం తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook