35 రైళ్లు రద్దు, 16 రైళ్లను దారి మళ్లించిన ఇండియన్ రైల్వే

35 రైళ్లు రద్దు, 16 రైళ్ల దారి మళ్లింపు చేసిన ఇండియన్ రైల్వే

Last Updated : Nov 18, 2018, 07:31 PM IST
35 రైళ్లు రద్దు, 16 రైళ్లను దారి మళ్లించిన ఇండియన్ రైల్వే

పంజాబ్‌లోని దసువ వద్ద చెరుకు రైతులు రైల్ రోకోకు దిగడంతో ఇండియన్ రైల్వే 71 ప్యాసింజర్ రైళ్లను దారిమళ్లిస్తూ సంబంధిత రైల్వే అధికారులకు ఆదేశాలు జారీచేసింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇవ్వాల్సి ఉన్న చక్కర పంట ధర బకాయిలను తక్షణమే మంజూరు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ శనివారం మధ్యాహ్నం 12:15 గంటలకు రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన ఇంకా కొనసాగుతున్నందువల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రైల్వే శాఖ ప్రకటించింది. ఉన్నట్టుండి ఒక్కచోట చేరిన 250 మందికిపైగా రైతులు.. దసువ-ఖుడ కురాల స్టేషన్ల మధ్య A-82 లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపై నిరసనకు దిగారు. ప్రభుత్వం నుంచి తమకు అందాల్సి ఉన్న బకాయిలు మంజూరు చేయనిదే తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తేలేదని రైతులు తేల్చిచెబుతున్నారు. చెరుకు రైతుల ఆందోళన కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు.

మొత్తం 71 రైళ్లపై చెరుకు రైతుల ఆందోళన ప్రభావం చూపించగా అందులో 35 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. 16 రైళ్లను దారి మళ్లించగా మరో 20 రైళ్లను మధ్యలోనే సర్వీసులు నిలిపేసినట్టు దీపక్ కుమార్ స్పష్టంచేశారు. దీంతో పంజాబ్‌లోని ఆ మార్గం ద్వారా ఉత్తర భారత్‌కి వెళ్లే రైళ్ల రాకపోకలు సైతం కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి. 

Trending News