Indian Railways: రేపు తొలి కిసాన్ రైలు ప్రారంభం

భారతీయ రైల్వే అరుదైన ఘనత సాధించనుంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేక రైలును ప్రారంబిస్తోంది. ఆగస్టు 7న ఈ ప్రత్యేక రైలు పట్టాలకెక్కనుంది. రైల్వేమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులిద్దరూ సంయక్తంగా ప్రారంభించనున్నారు.

Last Updated : Aug 6, 2020, 10:03 PM IST
Indian Railways: రేపు తొలి కిసాన్ రైలు ప్రారంభం

భారతీయ రైల్వే ( Indian Railways ) అరుదైన ఘనత సాధించనుంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేక రైలును ప్రారంబిస్తోంది. ఆగస్టు 7న ఈ ప్రత్యేక రైలు పట్టాలకెక్కనుంది.

ఇండియన్ రైల్వేస్ అంటేనే ఓ ప్రత్యేకత. ఎప్పుడూ ఏదో ప్రత్యేకత సాధిస్తుంటుంది. ఇప్పుడు రైతుల కోసం ప్రత్యేక రైలు ప్రవేశపెడుతోంది. అదే కిసాన్ రైలు ( kisan train ). రేపు అంటే ఆగస్టు 7న ఈ తొలి కిసాన్ రైలు పట్టాలకెక్కనుంది. మహారాష్ట్ర ( Maharashtra ) లోని దేవ్లాలి నుంచి బీహార్ ( Bihar ) లోని దానపూర్ వరకూ నడిచే తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ లు ( Railway minister piyush goel ) ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కిసాన్ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. వారానికోసారి నడిచే ఈ రైలు ఉదయం 11 గంటలకు దేవ్లాలిలో బయలుదేరి..మరుసటి రోజు సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు దానాపూర్ చేరుతుంది. 1519 కిలోమీటర్ల దూరాన్ని 32 గంటల్లో పూర్తి చేసుకుంటుంది. త్వరగా పాడయ్యే ఉత్పత్తులైన పాలు, మాంసం, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తుల్నివేగవంతంగా రవాణా చేసే ఉద్దేశ్యంతో ఈ కిసాన్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. Also read: Lebanon blast: ఆ అమ్మోనియం నైట్రేట్ సేఫ్..చెన్నైకు ప్రమాదం లేదు

 

Trending News