Indian Railways: దేశంలో రైళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయా..ఇండియన్ రైల్వేస్ ఏం చెప్పింది. కోవిడ్ కారణంగా రద్దైన రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైందనేది సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై కేంద్ర స్పష్టత ఇచ్చింది.
కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ, లాక్‌డౌన్ ( Lockdown ) నేపధ్యంలో దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు కూడా స్పెషల్ రైళ్లు, లేదా పండుగల సమయంలో ఫెస్టివల్ స్పెషల్ ( Festival special trains ) తప్ప మరేవీ నడవటం లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ( Corona vaccination ) నడుస్తుండటంతో మళ్లీ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయనే చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎంత వరకూ నిజమనేదే ప్రశ్న. నిజంగానే ఇండియన్ రైల్వే( Indian Railways ) ..ఈ నిర్ణయం తీసుకుందా..
భారతీయ రైల్వే, కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ఇదంతా ఫేక్ న్యూస్ అని..నమ్మవద్దని తేల్చి చెప్పాయి. రైళ్లను ప్రారంభించే విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని...వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించిన తరువాతే..సాధారణ రైలు సర్వీసుల ( Normal train services to resume ) పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు.
Also read: Republic Day Updates: రిపబ్లిక్ డే 2021 నేపథ్యంలో కీలక ప్రకటన చేసిన ఢిల్లీ మెట్రో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook