Railway Jobs: రాత పరీక్ష లేకుండానే 2 లక్షల జీతంతో రైల్వేలో ఉద్యోగాల భర్తీ, చివరి తేదీ ఎప్పుడంటే

IRCTC Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారికి కీలకమైన అప్‌డేట్. IRCTCలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది. భారీ జీతంతో ఈ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 11, 2024, 07:54 AM IST
Railway Jobs: రాత పరీక్ష లేకుండానే 2 లక్షల జీతంతో రైల్వేలో ఉద్యోగాల భర్తీ, చివరి తేదీ ఎప్పుడంటే

IRCTC Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. రైల్వేలో ఉన్నత స్థాయి పదవుల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగాలను ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ చేపడుతోంది. రైల్వేలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కళ్లు చెదిరే జీతం ఉంటుంది. 

ఇండియన్ రైల్వేస్ అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ రైల్వేలో కీలకమైన పదవుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా రైల్వేలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ పోస్టులున్నాయి. రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశం. జీతం ఏకంగా నెలకు 2 లక్షల రూపాయలుంటుంది. ఇంత భారీ జీతంతో రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి ఇదే మంచి అవకాశం. మీకు తగిన అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి. ఈ పోస్టులను ఐఆర్‌సీటీసీ భర్తీ చేయనుంది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ irctc.co.in.ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఐఆర్సీటీసీ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ నవంబర్ 6. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు కావల్సిన గరిష్ట వయస్సు 55 ఏళ్లు. అర్హత కలిగిన అభ్యర్దులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు జీతం 15,600 రూపాయల నుంచి 39,100 రూపాయల వరకు ఉంటుంది. అదే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ పోస్టులకు 70 వేల నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అర్హత వివరాలు irctc.co.in.లో స్పష్టంగా ఉన్నాయి. ఏ పోస్టుకు ఏ అర్హత అనేది తెలుసుకుని అప్లై చేసుకోవాలి. 

Also read: Green Tea Tips: గ్రీన్ టీ తాగే అలవాటుందా అయితే ఈ 7 తప్పులు చేయవద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News